Ashwin Pujara : భయ్యా, నువ్వు కూడా బౌలింగ్ చేస్తే నేనేం చేయాలి..? పుజారాను ప్రశ్నించిన అశ్విన్

భారత సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వర్తమాన అంశాలపై స్పందించడంతో పాటు తన సహచర ఆటగాళ్లను ఆటపట్టిస్తుంటాడు. తాజాగా నయా వాల్ పుజారాను అశ్విన్ ఆట పట్టించే ప్రయత్నం చేయగా ఇందుకు పుజారా కూడా అంతే ధీటుగా బదులిచ్చాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య చర్చ వైరల్ గా మారింది. అశ్విన్ ఏమని ట్వీట్ చేశాడు. అందుకు పుజారా ఏం సమాధానం చెప్పాడో చూద్దాం.

Ashwin Pujara : భారత సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వర్తమాన అంశాలపై స్పందించడంతో పాటు తన సహచర ఆటగాళ్లను ఆటపట్టిస్తుంటాడు. తాజాగా నయా వాల్ పుజారాను అశ్విన్ ఆట పట్టించే ప్రయత్నం చేయగా ఇందుకు పుజారా కూడా అంతే ఫన్నీగా బదులిచ్చాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య చర్చ వైరల్ గా మారింది. అశ్విన్ ఏమని ట్వీట్ చేశాడు. అందుకు పుజారా ఏం సమాధానం చెప్పాడో చూద్దాం.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ డ్రా గా ముగిసిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ఐదో రోజు ఆటలో ఎటూ ఫలితం తేలదని భావించిన కెప్టెన్ రోహిత్ శర్మ.. రెగ్యులర్ బౌలర్లకు కాసేపు విశ్రాంతి ఇచ్చి చెతేశ్వర్ పుజారా, శుభ్ మన్ గిల్ కు బంతిని ఇచ్చాడు. వీరిద్దరు చెరో ఓవర్ బౌలింగ్ చేశారు. అనంతరం ఫలితం ఎలాగూ తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్లు నిర్ణీత సమయం కన్నా గంట ముందుగానే మ్యాచ్ ను నిలిపివేసేందుకు అంగీకరించాయి.(Ashwin Pujara)

Also Read..Rohit Sharma on WTC Final: ఐపీఎల్ తో డబ్య్లూటీసీ విజయావకాశాలు దెబ్బతింటాయా.. ప్రిపరేషన్ పై రోహిత్ శర్మ ఏమన్నాడంటే..?

సరిగ్గా అశ్విన్ దీనిపైనే స్పందించాడు. ఎప్పుడూ బౌలింగ్ చేయని పుజారా.. బౌలింగ్ చేసే ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి ”నువ్వు కూడా బౌలింగ్ చేస్తే నేనేమీ చేయాలి. నా ఉద్యోగాన్ని వదిలేయాలా” అంటూ పుజారాను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. దీనికి పుజారా అందే ధీటుగా బదులిచ్చాడు. నాగ్‌పూర్‌లో వన్ డౌన్‌కు వెళ్లినందుకు ధన్యవాదాలు చెప్పడానికి మాత్రమే అంటూ పుజారా రిప్లయ్ ఇచ్చాడు. నాగాపూర్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఓ ఇన్నింగ్స్ లో అశ్విన్ వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చాడు. దీనిని ఉద్దేశించే పుజారా ఇలా ట్వీట్ చేశాడు.

“మీ ఉద్దేశం ప్రశంసించబడింది. అయితే ఇది మళ్లీ సాధ్యం అవుతుందో లేదో అని అంటూ పుజరా ట్వీట్ కు అశ్విన్ బదులిచ్చాడు. దీనిపై పుజారా ఇలా అన్నాడు. నీకు తగినంత విశ్రాంతి ఇవ్వడం వల్ల భవిష్యత్తులో అవసరమైతే నువ్వు మళ్లీ వన్ డౌన్‌లో బ్యాటింగ్ చేయొచ్చు అంటూ రిప్లై ఇచ్చాడు. ఇలా వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Also Read..India enter WTC final-2023: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరిన టీమిండియా

ఇదిలా ఉంటే.. ఆసీస్ తో సిరీస్ లో అశ్విన్ 25 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. రవీంద్ర జడేజా 22 వికెట్లు పడగొట్టాడు. భారత్ సిరీస్ గెలవడంలో వీరిద్దరు కీలక పాత్ర పోషించడంతో వీరికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.

జడేజాతో తనకున్న సాన్నిహిత్యంతో పాటు పిచ్‌లో ఇద్దరూ ఒకరికొకరు ఎలా సాయం చేసుకుంటున్నారనే దానిని అశ్విన్ వివరించాడు. ‘పిచ్ ఎలా స్పందిస్తుందనే దానిపై ఇద్దరం చర్చించుకుంటాం. అలాగే ఒకరికి ఒకరం సలహాలు ఇచ్చుకుంటుంటాం. గత రెండు మూడేళ్లుగా మా ప్రయాణం చాలా అద్భుతంగా సాగుతోంది. అవసరమైన సందర్భంలో వికెట్ తీసి నాపై జడేజా ఒత్తిడి లేకుండా చేస్తాడు. దీంతో నేను ఇంకా స్వేచ్ఛగా బౌలింగ్ చేసే అవకాశం ఉంటుంది” అని అశ్విన్ అన్నాడు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ట్రెండింగ్ వార్తలు