Rishabh Pant : మ‌ళ్లీ గ్రౌండ్‌లో అడుగుపెట్టిన పంత్‌.. వీడియో వైర‌ల్‌

గ‌తేడాది డిసెంబ‌ర్‌లో రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన టీమ్ ఇండియా వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ (Rishabh Pant) చాలా రోజుల త‌రువాత మైదానంలోకి అడుగుపెట్టాడు.

Rishabh Pant

Rishabh Pant batting practice : గ‌తేడాది డిసెంబ‌ర్‌లో రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన టీమ్ ఇండియా వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ (Rishabh Pant) చాలా రోజుల త‌రువాత మైదానంలోకి అడుగుపెట్టాడు. బ్యాట్ ప‌ట్టుకుని గ్రౌండ్‌లోకి వ‌చ్చిన పంత్ త‌న‌దైన శైలిలో ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డ్డాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

భార‌త స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఎస్‌డబ్ల్యూ విజయ్‌నగర్‌లో పంత్ తన ఉప‌న్యాసంతో యువ ఆట‌గాళ్ల‌తో ఉత్సాహం నింపాడు. అనంత‌రం వారితో క‌లిసి క్రికెట్ మ్యాచ్ ఆడాడు. త‌న సెంటిమెంట్ ప్రకారం మైదానాన్ని తాకి బ్యాట్‌తో లోప‌ల అడుగుపెట్టాడు. పంత్ గ్రౌండ్‌లో అడుగుపెడుతున్న సంద‌ర్భంలో అక్క‌డ ఉన్న ప్రేక్ష‌కులు అరుపులు, కేక‌ల‌తో హోరెత్తించారు. పంత్ త‌న‌దైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. ఫోర్లు, సిక్స‌ర్లు బాదాడు. అక్క‌డ ఉన్న వాళ్ల‌లో ఒక‌రు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది.

Prithvi Shaw : రీ ఎంట్రీ ఇస్తాడ‌నుకుంటే.. మ‌ళ్లీ గాయ‌ప‌డ్డాడు.. టైం బ్యాడ్ అంటే ఇదేనేమో..!

పంత్ మ‌ళ్లీ బ్యాట్ ప‌ట్టుకుని గ్రౌండ్‌లోకి అడుగుపెట్ట‌డం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంద‌ని అత‌డి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. పంత్ లేక‌పోవ‌డంతో భార‌త మిడిల్ ఆర్డ‌ర్ బ‌ల‌హీన ప‌డింది. ముఖ్యంగా టెస్టుల్లో పంత్ లేని లోటు స్ప‌ష్టంగా క‌నిపించింది. ఆస్ట్రేలియాతో బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ, ప్ర‌పంచ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్‌లో పంత్ స్థానంలో ఆడిన తెలుగు తేజం కేఎస్ భ‌ర‌త్ వికెట్ కీపింగ్‌లో ఆక‌ట్టుకున్న బ్యాట‌ర్‌గా పెద్ద‌గా ప‌రుగులు చేయ‌లేదు. దీంతో వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌లో ఇషాన్ కిష‌న్‌కు అవ‌కాశం ఇచ్చారు.

ప్ర‌స్తుతం బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ(NCA)లో పంత్ పున‌రావాసం పొందుతున్నాడు. మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించే ప‌నిలో ఉన్నాడు. వ‌చ్చే ఏడాది ఇంగ్లాండ్‌తో జ‌ర‌గ‌నున్న టెస్టు సిరీస్‌తో పంత్ రీ ఎంట్రీ ఇచ్చే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ అత‌డు త్వ‌ర‌గా ఫిట్‌నెస్ సాధిస్తే అంత‌కంటే ముందే అత‌డిని మైదానంలో చూడొచ్చు.

Ben Stokes : ప్ర‌పంచ‌క‌ప్ ముందు బెన్‌స్టోక్స్ కీల‌క నిర్ణ‌యం.. భార‌త్‌కు షాక్ త‌ప్ప‌దా..!

PCB : పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ట్రోల్ చేస్తున్న సొంత అభిమానులు.. చేసిన ప‌ని అలాంటిది మ‌రీ..!

ట్రెండింగ్ వార్తలు