Rohit Sharma : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త‌

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా కెప్టెన్‌, హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త సాధించాడు.

Rohit Sharma-Mohammad Azharuddin

Rohit Sharma became oldest Indian Captain : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా కెప్టెన్‌, హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త సాధించాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో టీమ్ఇండియాకు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన అతి పెద్ద వ‌య‌స్కుడిగా రికార్డుల‌కు ఎక్కాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో మ్యాచ్ సంద‌ర్భంగా రోహిత్ ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు. 36 ఏళ్ల 161 రోజుల వ‌య‌సులో రోహిత్ శ‌ర్మ టీమ్ఇండియాకు సార‌థ్యం వ‌హిస్తున్నాడు.

ఈ క్ర‌మంలో మాజీ కెప్టెన్ మ‌హ్మ‌ద్ అజారుద్దీన్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇంత‌క‌ముందు వ‌ర‌కు ఈ రికార్డు అజారుద్దీన్ పేరిట ఉండేది. 36 ఏళ్ల 124 రోజుల వ‌య‌సులో భార‌త జ‌ట్టుకు అజారుద్దీన్ నాయ‌క‌త్వం వ‌హించాడు. రోహిత్‌, అజారుద్దీన్ త‌రువాత రాహుల్ ద్ర‌విడ్ (34 ఏళ్ల 71 రోజులు), ఎస్ వెంక‌ట‌రాఘ‌వ‌న్ (34 ఏళ్ల 56 రోజులు) లు ఉన్నారు.

ప్రపంచ కప్ మ్యాచ్‌లో అత్య‌ధిక వ‌య‌సులో టీమ్ఇండియా సార‌థ్యం వ‌హించిన ఆట‌గాళ్లు..

రోహిత్ శ‌ర్మ – 36 ఏళ్ల 161 రోజులు – 2023 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌
మ‌హ్మ‌ద్ అజారుద్దీన్ – 36 ఏళ్ల 124 రోజులు – 1999 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌
రాహుల్ ద్రావిడ్ – 34 ఏళ్ల 71 రోజులు – 2007 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌
ఎస్ వెంకటరాఘవన్ – 34 ఏళ్ల 56 రోజులు – 1979 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌

Jake Fraser McGurk : 29 బంతుల్లో సెంచ‌రీ చేసిన ఆసీస్ బ్యాట‌ర్.. డివిలియ‌ర్స్ రికార్డు బ్రేక్‌

రోహిత్ రెండు సిక్సులు బాదితే..

రోహిత్ శ‌ర్మ ఈ మ్యాచ్‌లో రెండు సిక్స‌ర్లు బాదితే క్రిస్ గేల్ రికార్డు బ‌ద్ద‌లు అవుతుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు ప్ర‌స్తుతం గేల్ పేరిట ఉంది. గేల్ 553 సిక్స‌ర్లు బాదగా, రోహిత్ శ‌ర్మ 551 సిక్స‌ర్లు కొట్టాడు. అంతకు ముందు రోహిత్ అత్యంత వేగంగా 550 సిక్సర్లు బాదిన ఆట‌గాడిగా నిలిచిన సంగ‌తి తెలిసిందే. హిట్‌మ్యాన్‌ 471 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్‌ను అందుకోగా గేల్ 548 ఇన్నింగ్స్‌లో 550 సిక్స్‌లు బాదాడు.

అత్యధిక అంతర్జాతీయ సిక్సర్లు బాదిన ఆట‌గాళ్లు వీరే..

క్రిస్ గేల్ (వెస్టిండీస్) – 553 సిక్సర్లు
రోహిత్ శర్మ (భారత్) – 551 సిక్సర్లు*
షాహిద్ అఫ్రిది (పాకిస్థాన్) – 476 సిక్సర్లు
బ్రెండన్ మెకల్లమ్ (న్యూజిలాండ్) – 398 సిక్సర్లు
మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్) – 383 సిక్సర్లు

Virat Kohli : విరాట్ కోహ్లీ అరుదైన ఘ‌న‌త‌.. అనిల్‌కుంబ్లే రికార్డు బ్రేక్‌

ట్రెండింగ్ వార్తలు