Delhi Capitals: గంటకు 157కిలోమీటర్ల వేగంతో బౌలింగ్.. IPL 2022 ఫాస్టెస్ట్ డెలివరీ ఇదే

సన్‌రైజర్స్ హైదరబాద్ కోసం ఉమ్రాన్ మాలిక్ తన బెస్ట్ పర్‌ఫార్మెన్స్ చూపిస్తున్నాడు. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఈ యువ సెన్సేషన్ అతని రికార్డును తానే బ్రేక్ చేశాడు.

Delhi Capitals: సన్‌రైజర్స్ హైదరబాద్ కోసం ఉమ్రాన్ మాలిక్ తన బెస్ట్ పర్‌ఫార్మెన్స్ చూపిస్తున్నాడు. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఈ యువ సెన్సేషన్ అతని రికార్డును తానే బ్రేక్ చేశాడు.

ఢిల్లీ ఇన్నింగ్స్ లోని చివరి ఓవర్లో నాలుగో బంతిని 157కిలోమీటర్ల వేగంతో విసిరాడు. దురదృష్టవశాత్తు రొమెన్ పొవెల్ దానిని బౌండరీగా మలిచాడు.

అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ లో గంటకు 154కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ వేశాడు.

Read Also: అరుదైన జాబితాలో చేరిన ఉమ్రాన్ మాలిక్

ఢిల్లీతో మ్యాచ్ లో 4ఓవర్లలోనే వికెట్ కూడా తీయలేకపోవడంతో పాటు 52పరుగులు సమర్పించుకున్నాడు. ఇక డేవిడ్ వార్నర్ అజేయంగా 92 పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ కు 207/3 పరుగులు చేయడంలో కీలకంగా మారాడు.

ఐపీఎల్ 2022లో తన స్పీడ్ బౌలింగ్ తో ఉమ్రాన్ పలుమార్లు వార్తల్లో నిలిచాడు. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో 5/25 లాంటి ఫిగర్స్ నమోదు చేశాడు. ప్రస్తుత సీజన్ లో ఇప్పటి వరకూ బెస్ట్ బౌలింగ్ ఉమ్రాన్ దే. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో 4/28 నమోదు చేయగలిగాడు కూడా.

ట్రెండింగ్ వార్తలు