World Cup 2023 PAK vs SL : పాక్ ఆట‌గాళ్లు బౌండ‌రీ లైన్‌ను మార్చారా..? సోష‌ల్ మీడియాలో ఫోటోలు వైర‌ల్‌..?

మంగ‌ళ‌వారం ఉప్ప‌ల్ వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ చారిత్రాత్మ‌క విజ‌యాన్ని సాధించింది. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లోనే అతి పెద్ద ల‌క్ష్యాన్ని పాక్ ఛేధించింది

World Cup 2023 PAK vs SL

World Cup 2023 PAK vs SL ODI : మంగ‌ళ‌వారం ఉప్ప‌ల్ వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ చారిత్రాత్మ‌క విజ‌యాన్ని సాధించింది. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లోనే అతి పెద్ద ల‌క్ష్యాన్ని పాక్ ఛేదించింది. అయితే.. శ్రీలంక ఇన్నింగ్స్ సంద‌ర్భంగా బౌండ‌రీ లైన్‌ను పాకిస్తాన్ ఆట‌గాళ్లు మార్చారంటూ నెటీజ‌న్లు మండిప‌డుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. క్యాచ్‌ల‌ను సుల‌భంగా అందుకునేందుకే పాక్ ఆట‌గాళ్లు ఇలా చేశార‌ని ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

ఏం జ‌రిగిందంటే..?

హ‌స‌న్ అలీ బౌలింగ్‌లో కుశాల్ మెండీస్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఇమామ్ ఉల్ హ‌క్ అద్భుత రీతిలో ప‌ట్టుకున్నాడు. అయితే.. ఆ స‌మ‌యంలో బౌండ‌రీ లైన్ రోప్ కాస్త దూరంగా ఉన్న‌ట్లు క‌నిపించింది. బౌండరీ రోప్‌ను జ‌రిపిన‌ట్లు అక్క‌డ గ‌డ్డిపై చార‌లు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయంటూ నెటీజ‌న్లు ఇందుకు సంబంధించిన ఫోటోలను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. క్యాచ్‌ను సుల‌భంగా ప‌ట్టుకునేందుకే ఇలా బౌండ‌రీ లైన్‌ను దూరంగా జ‌రిపారా..? అని ప్ర‌శ్నిస్తున్నారు. అయితే.. దీనిపై ఐసీసీ ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు.

పాక్ మ్యాచుల్లోనే ఇలా ఎందుకు..?

ప్ర‌పంచ‌క‌ప్ లో పాకిస్తాన్ త‌న మొద‌టి మ్యాచులో నెద‌ర్లాండ్స్‌తో త‌ల‌ప‌డింది. ఆ మ్యాచ్‌లోనూ ఇలాగే జ‌రిగిందంటూ ప‌లువురు నెటీజ‌న్లు ఆరోపిస్తున్నారు. పాక్ ఆడే మ్యాచుల్లోనే ఇలా ఎందుకు జ‌రుగుతోంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ప్లేయ‌ర్లు కావాల‌నే ఇలా చేస్తున్నార‌ని మ‌రికొంద‌రు అంటున్నారు. దీనిపై ఐసీసీ దృష్టి సారించాల‌ని కోరుతున్నారు. మ్యాచ్ జ‌రిగే స‌మ‌యంలో ప‌లుమార్లు సిబ్బంది బౌండ‌రీ లైన్‌ను త‌నిఖీ చేయాల‌ని సూచిస్తున్నారు.

Shubman Gill Health Condition : శుబ్‌మాన్‌ గిల్ తిరిగి జట్టులో చేరబోతున్నాడా? బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ ఏం చెప్పాడంటే

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఈ మ్యాచ్‌లో శ్రీలంక మొద‌ట బ్యాటింగ్ చేసింది. కుశాల్ మెండీస్ (122; 77 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్స్‌లు), సదీర సమరవిక్రమ (108; 89 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) లు సెంచ‌రీల‌తో చెల‌రేగ‌డంతో లంక నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 344 ప‌రుగులు చేసింది. పాక్ బౌల్ల‌ర‌లో హ‌స‌న్ అలీ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. హరీస్ రవూఫ్ రెండు, ష‌హీన్ అఫ్రీదీ, మ‌హ్మ‌ద్ న‌వాజ్‌, షాదాబ్ ఖాన్ లు తలా ఓ వికెట్ తీశారు.

భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో కెప్ట‌న్ బాబ‌ర్ ఆజాం విఫ‌ల‌మైన‌ప్ప‌టికీ ఓపెన‌ర్ అబ్దుల్లా షఫీక్ (113; 103 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), వికెట్ కీప‌ర్ మ‌హ్మ‌ద్ రిజ్వాన్ (134 నాటౌట్‌; 121 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) లు శ‌త‌కాల‌తో రెచ్చిపోయారు. దీంతో ల‌క్ష్యాన్ని ఫాక్ జ‌ట్టు 48.2 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజ‌యంతో పాకిస్తాన్ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానానికి చేరుకుంది.

KL Rahul : కేఎల్ రాహుల్ కామెంట్స్‌.. అస్స‌లు ఊహించ‌లేదు.. అయ్య‌ర్ క‌నీసం రెండు ఓవ‌ర్లు అన్నా..

ట్రెండింగ్ వార్తలు