Vivo V29 Pro Series : వివో V29 ప్రో సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!

Vivo V29 Pro Series : వివో నుంచి సరికొత్త V29 సిరీస్ భారత మార్కెట్లోకి రానుంది. లాంచ్‌కు ముందే వివో V29 ప్రో సిరీస్ కీలక ఫీచర్లు లీకయ్యాయి.

Vivo V29 Pro Series Key Specifications : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ వివో (Vivo) నుంచి కొత్త (Vivo V29 Pro) సిరీస్‌ వచ్చే జూన్‌లో లాంచ్ కానుందని భావిస్తున్నారు. ఈ లైనప్‌ను భారత మార్కెట్‌లలో కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. Vivo V27 సిరీస్‌‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రానుంది. ఈ ఏడాది మార్చిలో వివో ఇండియాలో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్‌లతో రన్ అయ్యే V27, V27 Pro మోడల్‌లను ఆవిష్కరించింది. ఈ హ్యాండ్‌సెట్‌లు 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,600mAh బ్యాటరీలను అందించనుంది.

వివో కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో రాబోయే Vivo V29 Pro కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లను ధృవీకరించింది. Vivo V29 Pro హ్యాండ్‌సెట్ నిర్దిష్ట కీలక స్పెసిఫికేషన్‌లను అందించనుంది. అధికారిక వివో వెబ్‌సైట్‌లో లిస్టు అయింది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ HD+ రిజల్యూషన్ (2400 x 1080 పిక్సెల్‌లు) కర్వ్డ్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 12GB RAM, 256GB ఇంబిల్ట్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో ఉంటుందని ధృవీకరించింది. ఈ ఫోన్ లాంచ్ అయ్యే ఏకైక స్టోరేజ్ వేరియంట్ ధృవీకరించలేదు.

Read Also : BGMI iPhone Users : భారతీయ ఐఫోన్ యూజర్ల కోసం బీజీఎంఐ గేమ్.. పాత అకౌంట్‌తో ఇలా లాగిన్ అవ్వండి..!

వివో V29 స్పెషిఫికేషన్లు లీక్ :
కెమెరా ఫీచర్ల విషయానికి వస్తే.. వివో V29 Pro ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ 64MP ప్రైమరీ సెన్సార్‌ను అందించనుంది. వెరిఫై చేసిన స్పెసిఫికేషన్‌లతో పాటు టీజర్ ఇమేజ్‌లో అస్పష్టంగా కనిపిస్తుంది. మాడ్యూల్ వెనుక ప్యానెల్‌లో టాప్ లెఫ్ట్ కార్నర్‌లో దీర్ఘచతురస్రాకార కెమెరా ఐలండ్ ముందు కెమెరా కూడా 50MP సెన్సార్‌తో వస్తుంది.

ఈ ఫోన్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో కనిపిస్తుంది. సైడ్, బాటమ్‌లో చాలా స్లిమ్ బెజెల్స్ ఉన్నాయి. పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ హ్యాండ్‌సెట్ రైట్ ఎడ్జ్ కనిపిస్తాయి. కంపెనీ లోగో వెనుక ప్యానెల్ లోయర్ లెఫ్ట్ కార్నర్‌లో ఉంటుంది. వివో V29 Pro 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీతో వస్తుందని వివో లిస్టింగ్‌లో వెల్లడించింది.

Vivo V29 Pro Key Specifications Confirmed on Company Website Ahead of Launch

గతంలో వివో V29 లైట్ మోడల్ 6.78-అంగుళాల కర్వ్డ్ AMOLED ఫుల్-HD+ (2400 x 1080 పిక్సెల్‌లు) డిస్‌ప్లే, 16MP ఫ్రంట్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌లో 64MP మెయిన్ సెన్సార్, రెండు 2MP సెన్సార్‌లను అమర్చే అవకాశం ఉంది.

గత నివేదిక ప్రకారం.. లైట్ వేరియంట్ 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేసే అవకాశం ఉంది. ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 SoC ద్వారా శక్తిని పొందుతుంది. సింగిల్ 8GB + 128GB వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా, Vivo V29 Pro 299 డాలర్లు (దాదాపు రూ. 24,800)గా ఉంటుందని నివేదిక పేర్కొంది.

Read Also : OnePlus Nord N30 5G : వన్‌ప్లస్ నార్డ్ N30 5G సిరీస్ ఫోన్ స్పెషిఫికేషన్లు లీక్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు