WhatsApp iOS Update : ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్లు.. ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి!

WhatsApp Feature Update : ప్రముఖ మెసేంజింగ్ యాప్ వాట్సాప్ iOS యూజర్ల కోసం కొత్త అప్‌డేట్‌ను రిలీజ్ చేస్తోంది. అప్‌డేట్ వెర్షన్ 22.21.75 ఇప్పుడు ఐఫోన్ యూజర్లకు వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్‌లకు రియాక్షన్ పంపేందుకు అనుమతిస్తుంది.

WhatsApp Feature Update : ప్రముఖ మెసేంజింగ్ యాప్ వాట్సాప్ iOS యూజర్ల కోసం కొత్త అప్‌డేట్‌ను రిలీజ్ చేస్తోంది. అప్‌డేట్ వెర్షన్ 22.21.75 ఇప్పుడు ఐఫోన్ యూజర్లకు వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్‌లకు రియాక్షన్ పంపేందుకు అనుమతిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్ రియాక్ట్ లాంటి రియాక్షన్ ఫీచర్‌లు ఇప్పటికే ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఐఫోన్ వినియోగదారులు యాప్ స్టోర్ నుంచి తమ వాట్సాప్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా కొత్త ఫీచర్‌ను ఉపయోగించవచ్చు.

Apple స్టోర్ చేంజ్లాగ్ అధికారిక ప్రకటన ప్రకారం.. రియాక్షన్ ఫీచర్ ‘రాబోయే వారాల్లో’ iOS యూజర్ల అందరికి అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్ ఇంతకు ముందు ఆండ్రాయిడ్, iOS వినియోగదారుల కోసం బీటా టెస్టింగ్‌లో ఉంది. ఈ ఫీచర్ మొదట ఆండ్రాయిడ్ వెర్షన్ కోసం రూపొందించారు. ఇప్పుడు వాట్సాప్ iOS వెర్షన్ కోసం అందుబాటులో ఉంటుంది. స్టేటస్ రియాక్షన్‌తో పాటు, అప్‌డేట్ కాల్ లింక్‌ల ఫీచర్, అడ్మిన్ గ్రూప్ మెసేజ్ డిలీట్, మరిన్నింటితో సహా కొన్ని కొత్త ఫీచర్‌లను అందిస్తుంది. iOS యూజర్ల కోసం అందుబాటులో ఉన్న అన్ని కొత్త WhatsApp ఫీచర్లను నిశితంగా పరిశీలిద్దాం.

స్టేటస్ రియాక్షన్ ఫీచర్ (Status Reaction Feature) :
ఈ కొత్త అప్‌డేట్ అందుబాటులో ఉనన్ 8 ఎమోజీలతో WhatsApp స్టేటస్ రియాక్షన్ ఇచ్చేందుకు iOS యూజర్లకు అనుమతిస్తుంది. Heart eyes, Face with tears of joy, Face with open mouth, Crying face, Folded hands, Clapping hands, Party popper and hundred points వంటి రియాక్షన్లు అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్ యూజర్ స్టేటస్ ఓపెన్ చేసినప్పుడు రియాక్షన్ ఎమోజీలు చూసిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో రియాక్షన్ ఫీచర్‌లు ఎలా పనిచేస్తాయో అలానే వాట్సాప్ ఫీచర్ పోలి ఉంటుంది.

WhatsApp roll out new feature update for iOS Status reaction feature, call links and more

కాల్ లింక్స్ ఫీచర్ (Call Link Feature) :
ఐఓఎస్ యూజర్లు ‘కాల్ లింక్స్’ ఫీచర్‌ను కూడా పొందవచ్చు. వాట్సాప్‌లోని కాల్స్ ట్యాబ్‌లో యాడ్ చేసిన ట్యాబ్ మీకు కనిపిస్తుంది. ఈ ఫీచర్ యూజర్లకు ఆడియో లేదా వీడియో కాల్ కోసం లింక్‌ని క్రియేట్ చేయవచ్చు. యూజర్లను ఇన్వైట్ చేసేందుకు ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేసేందుకు అనుమతిస్తుంది. WhatsApp గ్రూప్ ఇన్వైట్ లింక్‌లు ఎలా పనిచేస్తాయో అలాగే పనిచేస్తుంది.

Undo ‘delete for me’ మెసేజ్ :
వాట్సాప్ వినియోగదారులు ఒకసారి పంపిన మెసేజ్ డిలీట్ చేయయడానికి అనుమతిస్తుంది. మీకోసం లేదా అందరి కోసం ఆ మెసేజ్ డిలీట్ చేయవచ్చు. కానీ, కొన్నిసార్లు, మీరు ప్రతి ఒక్కరి కోసం మెసేజ్ డిలీట్ చేయాలని భావించినప్పుడు అనుకోకుండా delete message for me’ పై క్లిక్ చేస్తారు. అయితే ఇప్పుడు ‘Undo delete for me’ ఫీచర్‌తో మీరు డిలీట్ చేసిన మెసేజ్‌ని తిరిగి పొందవచ్చు. ముఖ్యంగా, మీరు అందరి యూజర్ల కోసం డిలీట్ చేసిన మెసేజ్‌లను Undo చేయలేరని గమనించాలి.

అడ్మిన్ డిలీట్ ఫీచర్ (Admin delete feature) :
ఇప్పుడు గ్రూప్ అడ్మిన్‌లు పార్టిసిపెంట్‌ల ద్వారా గ్రూపు సభ్యుల ఏదైనా మెసేజ్‌ని డిలీట్ చేయవచ్చు. కొత్త అప్‌డేట్ ఇప్పుడు గ్రూప్ మెంబర్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయితే అది అడ్మిన్‌లకు మాత్రమే తెలుస్తుంది. మిగతా సభ్యులకు ఎలాంటి మెసేజ్ కనిపించదు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Whatsapp Online Status : వాట్సాప్‌లో ఫ్రెండ్స్‌తో చాట్ చేసేటప్పుడు మీ ఆన్‌లైన్ స్టేటస్ హైడ్ చేయొచ్చు తెలుసా?

ట్రెండింగ్ వార్తలు