Kaushik Reddy: బీఆర్ఎస్ కు ఇబ్బందిగా కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి.. హుజూరాబాద్ టిక్కెట్ పై పునరాలోచన!

MLC Padi Kaushik Reddy

Padi Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డి.. ఈ మధ్య వార్తల్లో కంటే.. వివాదాల్లోనే ఎక్కువగా ఉంటున్నారు. నోటి దురుసుతో చేస్తున్న కామెంట్స్.. పార్టీకి మైలేజ్ ఇవ్వడం కంటే డ్యామేజ్ ఎక్కువ చేస్తున్నాయ్. ఇది.. హైకమాండ్ దాకా వెళ్లింది. దాంతో వచ్చే ఎన్నికల్లో కౌశిక్ రెడ్డికే ఎమ్మెల్యే టికెట్ ఇద్దామనుకున్న బీఆర్ఎస్ (BRS Party) అధిష్టానం ఇప్పుడు వెనక్కి తగ్గిందనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈటల రాజేందర్ (Eatala Rajender) కు ధీటైన పలువురు క్లీన్ ఇమేజీ ఉన్న నేతలను సైతం గుర్తించారట గులాబీబాస్. ఇదే సమయంలో హుజూరాబాద్ (Huzurabad) కే చెందిన పొరుగు నియోజకవర్గ ఎమ్మెల్యే పేరును కూడా పరిశీలిస్తున్నారన్న టాక్ విన్పిస్తోంది. అసలు పాడి కౌశిక్ రెడ్డి విషయంలో బీఆర్ఎస్ ఏం చేయబోతోంది. చేతిదాకా వచ్చిన అవకాశాన్ని కౌశిక్ రెడ్డి చేజార్చుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది?

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి.. కాంట్రవర్శీకి కేరాఫ్ గా మారిపోయారు. తన దూకుడుతో.. తరచుగా వివాదాల్లో నిలుస్తున్నారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చినా.. కౌశిక్శైలిలో మాత్రం మార్పు కనిపించట్లేదనే టాక్ వినిపిస్తోంది. నిన్న మొన్నటి దాకా ఉప ఎన్నికల బరిలో దిగిన గెల్లు శ్రీనివాస్ వర్సెస్ కౌశిక్ రెడ్డిగా ఉండేది హుజూరాబాద్ లో వర్గపోరు. ఆ తర్వాత కౌశిక్ రెడ్డిని ఇంచార్జీగా ప్రకటించిన బీఆర్ఎస్.. గెల్లు శ్రీనివాస్ కు టూరిజం కార్పొరేషన్ పదవి కట్టబెట్టింది. దీంతో ఇద్దరి మధ్య గ్రూపు తగాదాకు పుల్ స్టాప్ పడ్డట్లయింది. అయితే అప్పటినుంచి ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటున్నారు కౌశిక్. గవర్నర్ తమిళిసైపై అనుచిత వ్యాఖ్యలు చేసి.. మహిళా కమిషన్ ముందు సంజాయిషీ ఇచ్చుకున్నారు.

ఇటీవల జరిగిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో రైతు దినోత్సవ సభలో.. రైతుల మీదే నోరు పారేసుకోవడం విమర్శల పాలైంది. గ్రామాల పర్యటనల్లో అధికారులను, సిబ్బందిని దూషించిన వీడియోలు, ఆడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈటల రాజేందర్ సామాజికవర్గమైన ముదిరాజ్ లను ఉద్దేశించి అనుచితంగా కౌశిక్ రెడ్డి మాట్లాడారంటూ సోషల్ మీడియాలో ఆడియోలు చక్కర్లు కొట్టాయి. కౌశిక్ తీరుకు వ్యతిరేకంగా ముందిరాజ్ సంఘాలు ఆందోళనలు నిర్వహించడంతో వ్యవహారం బీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారింది. ఆ ఆడియో తనది కాదంటూ డిజిపికి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేసినా జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయిందనే భావనలో ఉందట గులాబీదళం. హుజూరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలన్నీ స్థానిక నాయకత్వం ద్వారా పార్టీ అధిష్టానానికి చేరాయి. ఇటు ఇంటలిజెన్స్ నివేదికలు సైతం గూలాబీ బాస్ గుప్పిట్లో ఉన్నాయట.

Also Read: హ్యాండిచ్చిన ఎమ్మెల్యేపై రగిలిపోతోన్న కాంగ్రెస్.. సత్తాచాటాలని చూస్తున్న బీజేపీ

ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు పోటీగా బీఆర్ఎస్ కౌశిక్ రెడ్డిని ఎంకరేజ్ చేస్తూ వచ్చింది బీఆర్ఎస్. ఈటలపై అగ్రెసివ్ గా దూసుకెళ్లేందుకు కౌశిక్ సూటబుల్ అని భావించిన అధిష్టానం.. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి పెద్దల సభకు కూడా పంపించింది. కానీ.. ఇప్పుడదే పార్టీకి ఇబ్బందిగా మారిందనే టాక్ బీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రత్యర్థిగా దూకుడుగా ఉండాల్సిన నేత వరుస వివాదాల్లో చిక్కుకోవడంతో సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాల్సి వస్తోంది. ఆయన తీరు.. ఎమ్మెల్యే ఈటలకు ప్లస్ అవుతుండగా.. బీఆర్ఎస్ కు మైనస్ అవుతుందనే చర్చ మొదలైంది. దాంతో.. కౌశిక్ రెడ్డికి బదులుగా హుందాగా ఉండే నేత అన్వేషణలో పడిందనే టాక్ విన్పిస్తోంది.

Also Read: ప్రధాని మోదీ ‘వరంగల్ పర్యటన’ బీజేపీకి ఎందుకింత ప్రతిష్టాత్మకం? దక్షిణ భారతంతో దీనికి సంబంధం ఏంటి?

ఎలాగూ ఎమ్మెల్సీగా ఉన్న కౌశిక్ రెడ్డిని అలాగే ఉంచి ఎమ్మెల్యేగా వివాదరహిత అభ్యర్థిని బరిలోకి దింపేందుకు ప్లాన్ చేస్తుంది కారు పార్టీ. క్యాడర్ కూడా పార్టీకి దూరమయ్యే ప్రమాదముందని పసిగట్టి.. కౌశిక్ విషయంలో తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నట్లు క్యాడర్కు సంకేతాలు అందుతున్నాయట. మరోవైపు హుజూరాబాద్ నియోజకవర్గంలో సీనియర్ నేతగా ఉన్న తుమ్మేటి సమ్మిరెడ్డి సైతం కౌశిక్ తీరుపై తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. ఇలాగే వదిలేస్తే మరికొంతమంది గళం విప్పుతారని పార్టీ పరువు బజారును పడుతుందనే ఆలోచనతో సమ్మిరెడ్డికి వెంటనే షోకాజు నోటీసు ఇఛ్చి నోరు మూయించింది గులాబీ పార్టీ.

కౌశిక్ రెడ్డిని పక్కనబెడితే.. హుజూరాబాద్ టికెట్ ఎవరికి.. వివరాలకు ఈ వీడియో చూడండి

ట్రెండింగ్ వార్తలు