Modi in Warangal: ప్రధాని మోదీ ‘వరంగల్ పర్యటన’ బీజేపీకి ఎందుకింత ప్రతిష్టాత్మకం? దక్షిణ భారతంతో దీనికి సంబంధం ఏంటి?

వరంగల్ పర్యటనను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కారణం చేతనే ఎన్నడూ లేని విధంగా వరంగల్ నగరంలో 26 కిలోమీటర్ల భారీ ర్యాలీని ఏర్పాటు చేశారు. ఎప్పటి నుంచో పెండింగులో ఉన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి వాటికి శంకుస్థాపనకు పూనుకున్నారు.

Warangal Visit: ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరంగల్ నగరంలో పర్యటనకు వచ్చారు. ప్రధాని పర్యటన కోసం అధికారిక ఏర్పాట్లు సహా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఈ మధ్య కాలంలో ప్రధాని మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పర్యటన ఇదే. ప్రధాని మోదీకే కాదు, భారతీయ జనతా పార్టీకి కూడా ఈ పర్యటన అత్యంత కీలకం. మరో ఆరు నెలల్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం సార్వత్రిక ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. వాస్తవానికి ఈ రెండు ఎన్నికలకు ఈ పర్యటన ఎంతో ప్రతిష్టాత్మకం.

MP Urination Case: ఆందోళనలో మూత్ర బాధితుడు.. కాళ్లు కడిగి సన్మానం చేశారు సరే, రేపటి భద్రత సంగతేంటి?

2014 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం అనంతరం.. అన్ని రాష్ట్రాల్లో పాగా వేస్తూ తమకు తిరుగేలేదని చాటిచెప్పుకుంటున్న బీజేపీకి.. దక్షిణాది మాత్రం చిక్కడం లేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కనీవని ఎరుగని విజయం సాధించినప్పటికీ దక్షిణం నుంచి వచ్చిన మద్దతు మాత్రం అంతంత మాత్రమే. వచ్చే ఏడాది ప్రథమార్థంలో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి దక్షిణాదిలో ప్రభావం చూపించాల్సిన అవసరం ఉంది. అందుకు దక్షిణాదిలో బీజేపీకి తెలంగాణ ఎంతో కీలకంగా మారింది.

pm modi at bhadrakali temple in warangal

వాస్తవానికి బీజేపీకి దక్షిణాదిన ఎప్పటి నుంచో గట్టి పట్టున్న ప్రాంతం కర్ణాటక. పట్టుండడమే కాదు, పలుమార్లు ఆ రాష్ట్రంలో అధికారంలో కూడా ఉంది. అయితే దేశమంతా బీజేపీ గాలి విస్తున్న సమయంలో కొద్ది రోజుల క్రితం జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దారుణ పరాజయం పాలైంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలో ఉన్న 28 లోక్‭సభ స్థానాలకు గాను బీజేపీ 25 స్థానాలు గెలిచినప్పటికీ.. నాలుగేళ్ల తర్వాత సీన్ మారిపోయింది. ఈ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్ చావుదెబ్బ కొట్టింది. 224 అసెంబ్లీ సీట్లకు గాను కాంగ్రెస్ 135 గెలిచింది. బీజేపీ కేవలం 66 సీట్లకు పరిమితమైంది. సార్వత్రి ఎన్నికలు సమీపంలోనే ఉండడంతో ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కూడా.

PM Modi Warangal tour: దేశాభివృద్ధిలో తెలుగువారి ప్రతిభ కీలకంగా మారింది.. విజయ సంకల్ప్ సభలో ప్రధాని మోదీ.. Live Updates

ఇక దక్షిణాదిలో మరే రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభావం చూపలేదు. కాకపోతే తెలంగాణ మాత్రం ఆ పార్టీకి కాస్త ఊరటగా కనిపిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలుపొందడం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టడం, ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడం లాంటి పరిణామాలు బీజేపీకి దక్షిణాదిలో తెలంగాణ కొత్త ఊపిరినిస్తున్నట్లు కనిపిస్తోంది. కర్ణాటకలో పార్టీ ఇప్పటికీ బలంగానే ఉన్నప్పటికీ ఇప్పటి పరిస్థితుల్లో అక్కడ కాలుమోపేలా కనిపించడం లేదు. అలా అని దక్షిణాది వదిలేస్తే 130 స్థానాలను పైగా వదులుకున్నట్లే. అందుకే అంతో ఇంతో బలం ఉన్న తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు బీజేపీ సిద్ధమైంది.

pm modi inaugurating development projects in warangal

అందుకే వరంగల్ పర్యటనను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కారణం చేతనే ఎన్నడూ లేని విధంగా వరంగల్ నగరంలో 26 కిలోమీటర్ల భారీ ర్యాలీని ఏర్పాటు చేశారు. ఎప్పటి నుంచో పెండింగులో ఉన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి వాటికి శంకుస్థాపనకు పూనుకున్నారు. 6,100 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులను స్వయంగా ప్రారంభిస్తున్నారు. పైగా బీజేపీ స్థాపించిన మొదటి ఎన్నికల్లో దేశంలో గెలిచిన స్థానాలు రెండయితే.. అందులో ఒకటి ప్రస్తుత వరంగల్ లోక్‭సభ స్థానం (ఇంతకు ముందు ఇది హన్మకొండ లోక్‭సభగా ఉండేది). 1984లో బీజేపీ టికెట్ మీద చెందుపట్ల జంగా రెడ్డి ఇక్కడి నుంచి గెలిచారు. అనంతరం ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు.

Karnataka Assembly : ఎమ్మెల్యేనంటూ కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో 72 ఏళ్ల వ్యక్తి హల్ చల్ .. ఏం చేశాడో తెలుసా..?

ఇత్యాది కారణాల చేత వరంగల్ సభను భారతీయ జనతా పార్టీ అత్యంత కీలకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే సార్వత్రి ఎన్నిక ఎన్నికల్లో తెలంగాణ కేంద్రంగానే దక్షిణాదిలో బీజేపీ ప్రచారం ఉండనున్నట్లు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. కర్ణాటక నష్టాన్ని తెలంగాణలో భర్తీ చేసుకోవాలని కమలం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ పార్టీ అనుకున్నట్లు తెలంగాణలో బీజేపీ బలపడితే.. ఆ ప్రభావం పొరుగు రాష్ట్రం కర్ణాటకపై చాలా ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాదిలోనూ ఆ ప్రభావం కనిపించొచ్చని అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు