Munugode By Poll : గెలుపుకోసం టీఆర్ఎస్ ఫీట్లు .. దోశలు,పూరీలు వేసి ఇస్త్రీ చేసిన మంత్రి ఎర్రబెల్లి

మునుగోడులో గెలుపు ప్రధాన మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. గెలుపు కోసం టీఆర్ఎస్ నేతలు తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు.దీంట్లో భాగంగానే చండూరులో ప్రచారంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. మునుగోడులో పర్యటిస్తూ రోడ్డు పక్క హోటల్స్ లో హల్ చల్ చేస్తున్నారు.దోశలు వేసేస్తున్నారు. పూరీలు వేసేస్తున్నారు. అలాగే ఇస్త్రీ పెట్టె పట్టుకుని బట్టలు ఇస్త్రీ చేసేస్తు తెగ హడావిడి చేసేస్తున్నారు.

Munugode By Poll :  మునుగోడులో గెలుపు ప్రధాన మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇటు టీఆర్ఎస్ మునుగోడులో ఎలాగైనా సరే విజయం సాధించాలని ఫీట్లు చేస్తోంది. మరోపక్క కాంగ్రెస్ ను వదిలి బీజేపీలో జాయిన్ అయి మునుగోడుకు ఉప ఎన్నికకు కారణమై..బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ కు మునుగోడులో గెలుపు చాలా చాలా ముఖ్యం. అలాగే కాంగ్రెస్ పార్టీకు హ్యాండ్ ఇచ్చిన రాజగోపాల్ ను ఎలాగైనా ఓడించి పట్టునిలుపుకోవాలని హస్తం పార్టీ యత్నాలు అన్నీ ఇన్నీకావు. ఇలా మునుగోడులో గెలుపు ఇటు అధికార పార్టీకి..అటు బీజేపీ, కాంగ్రెస్ లకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో ఓటర్లను ఆకట్టుకోవటానికి ఆయా పార్టీలు ఫీట్లు మొదలుపెట్టేశాయి. ఓపక్కన ధారాళంగా డబ్బు పంచుతున్నారనే ఆరోపణలు వస్తున్న క్రమంలో టీఆర్ఎస్ పార్టీ మునుగోడులో తనదైన శైలిలో ఫీట్లు మొదలుపెట్టేసింది.

TRS Car Symbol : కారును పోలిన ఆ 8 ఎన్నికల గుర్తులపై టీఆర్ఎస్ న్యాయపోరాటం

దీంట్లో భాగంగానే చండూరులో ప్రచారంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. మునుగోడులో పర్యటిస్తూ రోడ్డు పక్క హోటల్స్ లో హల్ చల్ చేస్తున్నారు.దోశలు వేసేస్తున్నారు. పూరీలు వేసేస్తున్నారు. అలాగే ఇస్త్రీ పెట్టె పట్టుకుని బట్టలు ఇస్త్రీ చేసేస్తు తెగ హడావిడి చేసేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ..మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు తథ్యం అని ధీమా వ్యక్తం చేశారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తు అయిన కారు గుర్తును పోలిన గుర్తులు ఈసీ కేటాయించటంపై పోరాటం చేస్తామని తెలిపారు.

కాగా.. మునుగోడు ఉప ఎన్నికల గుర్తులపై టీఆర్ఎస్ న్యాయపోరాటానికి సిద్ధమైంది. మునుగోడు ఉపఎన్నికలో కారు గుర్తును పోలిన 8 సింబల్స్ ను ఎవరికీ కేటాయించవద్దు అంటూ ఇటీవల ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈసీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు టీఆర్ఎస్ శ్రేణులు నిర్ణయించాయి.

ట్రెండింగ్ వార్తలు