Andhra pradesh : ’క్విట్ జగన్ సేవ్ ఆంధ్ర‘తోనే నిరుద్యోగులకు ఉద్యోగాలు : చంద్రబాబు

టీడీపీ అధినేత..మాజీ సీఎం చంద్రబాబు ‘క్విట్ జగన్ సేవ్ ఆంధ్ర’ పులుపునిస్తూ..రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. దీంట్లో భాగంగా ప్రస్తుతం విజయనగరం జిల్లాలో బాబు పర్యటిస్తూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ..‘క్విట్ జగన్ సేవ్ ఆంధ్ర’తోనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు.

Chandrababu Vizianagaram Tour: టీడీపీ అధినేత..మాజీ సీఎం చంద్రబాబు ‘క్విట్ జగన్ సేవ్ ఆంధ్ర’ పులుపునిస్తూ..రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. దీంట్లో భాగంగా ప్రస్తుతం విజయనగరం జిల్లాలో బాబు పర్యటిస్తూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ..‘క్విట్ జగన్ సేవ్ ఆంధ్ర’తోనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు. ఏపీలో ప్రస్తుతం రాక్షసపాలన కొనసాగుతోందని ఈ నియంతపాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని ఈ కష్టాలు పోవాలంటే జగన్ ను అందరు క్విట్ చేయాలని పిలుపునిచ్చారు.

నిజాయితీపరుడైన అశోక్ గజపతిపై కేసులు పెట్టిన ఘతన వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని రామతీర్థం దేవాలయంలో చేసిన అరాచకాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని అన్నారు. రామతీర్థం దేవాలయంలో విగ్రహాలు ధ్వంసం చేసిన ఘటన సమయంలో తాను రామతీర్థం వస్తే నాపై అక్రమ కేసులు బనాయించారని..అన్యాయాలను..అక్రమాలను..విధ్వంసాలను ప్రశ్నించేవారిపై అక్రమ కేసలు పెట్టటమే వైసీపీకి తెలిసిన పాలన అని విమర్శించారు.

గతంలో కరెంట్ బిల్లుల విషయంలో తమ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన జగన్ ఇప్పుడు తన పాలనలో అత్యంత భారీగా కరెంట్ బిల్లులు పెంచేసారని..అప్పడు అన్యాయం అనిపించింది ఇప్పుడు వారి పాలనలో న్యాయంగా ఎలా కనిపిస్తుందోనని ఎద్దేవా చేశారు. అన్యాయాన్ని ప్రశ్నించినవారిపై కేసులు పెట్టి..వారిని నానా ఇబ్బందులకు గురించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వివర్శించారు.

ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రాగా చేసి మూడు రాజధానులు అంటూ విధ్వంసక నిర్ణయాలు తీసుకుంటున్న ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్న జగన్ ను ప్రజలంతా ‘క్విట్’చేయాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రాలో ఉన్న వనరుల్ని దోచుకోవటానికి విశాఖను రాజధానిగా ప్రకటించారని రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతుల్ని రోడ్డుమీకు ఈడ్చిన ఘనత జగన్ కు మాత్రమే దక్కుతుందని అన్నారు.

బొత్స సత్యనారాయణకు కు సారా వ్యాపారం మాత్రమే తెలుసు..పాలన అంటే ఏంటో తెలీదు అంటూ ఉత్తరాంధ్ర జగన్ పెత్తనం ఏంటి? విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి పెత్తనం ఏంటి? అని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రశ్నించారు. తల్లిదండ్రులకు వారి బిడ్డలమీద శ్రద్ధ లేకపోవటం వల్లే విద్యార్థులు పరీక్ష ఫెయిల్ అయ్యారని మంత్రి బొత్స అంటున్నారని ఇది చాలా దారుణం అని..సారా వ్యాపారం చేసేకునే వారికి విద్యాశాఖ అప్పగిస్తే ఇలాగే ఉంటుందని..అంత గొప్ప మంత్రి గారు బొత్సకి పద్మ శ్రీ, విద్మ విభూషన్ అవార్డ్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు.

శ్రీలంకలో జరిగింది ఎపి లో కూడా జరుగుతోందని..జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు పోరాడాలని అరాచక పాలనతో ప్రజలను ముంచేసిన జగన్ ను ఓడించాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. కాగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న చంద్రబాబు ఇప్పటికే విశాఖ, అనకాపల్లి నియోజకవర్గాలపై పోకస్ చేసి..స్థానిక నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఈ క్రమంలో శుక్రవారం (17,2022) విజయనగరం పర్యటిస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు