Pawan Kalyan accepts ktr’s challenge: కేటీఆర్ సవాలును స్వీకరించి ఫొటోలు పోస్ట్ చేసిన పవన్.. చంద్రబాబుకి ఛాలెంజ్

చేనేత దినోత్సవం సందర్భంగా ఆ దస్తులు ధరించిన ఫొటోలు పోస్ట్ చేయాలని పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా, మాజీ క్రికెటర్ సచిన్‌ టెండూల్కర్‌తో పాటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సవాలు విసిరారు. దీంతో ఆయన సవాలును పవన్‌ కల్యాణ్‌ స్వీకరించారు. తాను గతంలో చేనేత దుస్తులు ధరించి పలు కార్యక్రమాల్లో తీసుకున్న ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు.

Pawan Kalyan accepts ktr’s challenge: చేనేత దినోత్సవం సందర్భంగా ఆ దస్తులు ధరించిన ఫొటోలు పోస్ట్ చేయాలని పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా, మాజీ క్రికెటర్ సచిన్‌ టెండూల్కర్‌తో పాటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సవాలు విసిరారు. దీంతో ఆయన సవాలును పవన్‌ కల్యాణ్‌ స్వీకరించారు. తాను గతంలో చేనేత దుస్తులు ధరించి పలు కార్యక్రమాల్లో తీసుకున్న ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు.

‘రామ్‌ భాయ్‌.. మీ సవాలును స్వీకరించాను’ అని పవన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌, ఏపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి పవన్‌ కల్యాణ్ ఈ సవాల్‌ విసిరారు. కాగా, తెలంగాణలో ఇవాళ కేటీఆర్ నేతన్న బీమా పథకాన్ని ప్రారంభించనున్నారు. రైతులకు అందజేస్తోన్న బీమాలాగే నేతన్నలకు బీమా పథకాన్ని అమలు చేస్తారు. నేతన్న బీమా పథకం కింద 80 వేల మంది లబ్ధి పొందనున్నారు. 60 ఏళ్ళ వయసులోపు ఉన్న నేత కార్మికులు ఈ పథకానికి అర్హులు. నేత కార్మికుడు మృతి చెందితే అతడి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందిస్తారు.

ట్రెండింగ్ వార్తలు