Whatsapp Chat Backup : మీ వాట్సాప్ చాట్‌ స్టోరేజీకి పేమెంట్ చేయడం లేదా? వెంటనే ఈ సెట్టింగ్‌ని మార్చండి!

Whatsapp Chat Backup : మీ వాట్సాప్ డేటా బ్యాకప్ కోసం గూగుల్ డ్రైవ్ వాడుతున్నారా? అయితే, ఇప్పుడే ఈ సెట్టింగ్ మార్చుకోండి. లేదంటే స్టోరేజీ కోసం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

Whatsapp Chat Backup : మీ వాట్సాప్ చాట్ డేటాతో గూగుల్ డిస్క్ స్టోరేజీ నిండిపోయిందా? అయితే, ఇకపై ఉచితంగా వాట్సాప్ డేటాను స్టోర్ చేసుకోలేరు. వాట్సాప్ వినియోగదారులు డేటాను స్టోర్ చేయడానికి గూగుల్ డిస్క్‌ని ఉపయోగించడం కొనసాగిస్తే ఇకపై డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఉచిత స్టోరేజ్ స్పేస్ నిండితే, చాట్ బ్యాకప్‌కు త్వరలో చెల్లించాల్సి ఉంటుంది. స్టోరేజీ అవసరాలకు తగినట్టుగా వినియోగదారులు తమ వాట్సాప్‌లోని సెట్టింగ్‌లను మార్చుకోవాల్సి ఉంటుంది.

15జీబీ వరకు స్టోరేజీ ఫ్రీగా వాడుకోవచ్చు :
ఇటీవలి ప్రకటనలో, డిసెంబర్ 2023 నుంచి ఆండ్రాయిడ్ యూజర్లు వాట్సాప్ చాట్, మీడియా బ్యాకప్‌లను నిర్వహించే విధానంలో గూగుల్, వాట్సాప్ గణనీయమైన మార్పును వెల్లడించాయి. కీలకమైన మార్పు ఏమిటంటే.. ఈ బ్యాకప్‌లు ఇప్పుడు యూజర్లు గూగుల్ మొత్తం స్టోరేజీ పరిమితిని తగ్గిస్తాయి. గూగుల్ యూజర్లు తమ అకౌంట్లలో 15జీబీ ఉచిత స్టోరేజీని అందిస్తుంది. జీమెయిల్, ఫొటోలు, డ్రైవ్ వంటి వివిధ సర్వీసులను పొందవచ్చు.

Read Also : WhatsApp AI chatbot : వాట్సాప్ యూజర్ల కోసం కొత్త ఏఐ చాట్‌బాట్.. ఇదేలా పనిచేస్తుందంటే?

2024 నుంచి అందరికి అందుబాటులోకి :
ఇంతకుముందు, వాట్సాప్ బ్యాకప్‌లు ఈ స్టోరేజీ పరిమితి నుంచి మినహాయించింది. కానీ, రాబోయే అప్‌డేట్‌తో ఈ బ్యాకప్‌లు మొత్తం స్టోరేజీలో ఎంత అనేది లెక్కించనుంది. అంటే.. జీమెయిల్, గూగుల్ ఫొటోలు వంటి ఇతర సర్వీసుల కారణంగా యూజర్లు గూగుల్ అకౌంట్లో లిమిట్ చేరుకుంటే వాట్సాప్ చాట్‌లను స్టోర్ చేయడానికి వారికి తక్కువ స్టోరేజీ మాత్రమే అందుబాటులో ఉంటుంది. వాట్సాప్ బ్యాకప్‌లు గూగుల్ డిస్క్ స్టోరేజ్ పరిమితిని ఉల్లంఘించిన తర్వాత 2018 నుంచి మరోసారి ఈ అప్‌డేట్ అందుబాటులోకి రానుంది. వాట్సాప్ బీటా యూజర్ల కోసం వచ్చే నెలలో కొత్త అప్‌డేట్ రిలీజ్ కానుంది. 2024 మొదటి ఆరు నెలల్లో అన్ని వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా క్రమంగా విస్తరించనుంది.

ఎవరిపై ప్రభావం ఉండదంటే? :
ఈ అప్‌డేట్‌తో ప్రత్యేకంగా వ్యక్తిగత గూగుల్ అకౌంట్లకు ఖాతాలకు వర్తిస్తాయని, ఆఫీసు లేదా స్కూల్ కోసం ఉపయోగించే గూగుల్ వర్క్‌స్పేస్ సబ్‌స్క్రిప్షన్‌లను కలిగిన వినియోగదారులకు ఎలాంటి ప్రభావం ఉండదని గమనించాలి.

storing WhatsApp chats

పేమెంట్ వద్దా? ఈ సెట్టింగ్‌ని మార్చండి :
అధిక మొత్తంలో స్టోరేజీ సమస్యలను పరిష్కరించడానికి, వినియోగదారులు తమ గూగుల్ అకౌంట్ల నుంచి అనవసరమైన ఫైల్‌లను తొలగించడాన్ని ఎంచుకోవచ్చు. తద్వారా వాట్సాప్ డేటా మరింత స్టోర్ చేసుకోవచ్చు. లేదా అదనపు క్లౌడ్ స్టోరేజీ స్పేస్ అందించే సబ్‌స్క్రిప్షన్ సర్వీసు అయిన గూగుల్ వన్‌ సభ్యత్వాన్ని పొందవచ్చు.

గూగుల్ వన్ ప్లాన్లు ఇవే :
గూగుల్ వన్ ప్లాన్లలో 100జీబీకి నెలకు రూ.130, 200జీబీకి రూ.210, 2టీబీ ప్లాన్‌కు రూ.650తో కొనుగోలు చేయొచ్చు. వార్షిక ప్లాన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. స్టోరేజీ అవసరాలకు సంబంధించి ఎదురయ్యే ఖర్చులను తగ్గించుకోవడానికి వినియోగదారులు సెట్టింగ్‌లను ఎడ్జెస్ట్ చేసుకునే అవకాశం ఉంది.

గూగుల్ డ్రైవ్‌ యాప్‌లో వాట్సాప్ చాట్ బ్యాకప్‌ను ఆఫ్ చేయడం ద్వారా, వినియోగదారులు తమ చాట్‌లు, వాట్సాప్ డేటా గూగుల్ డ్రైవ్‌లో స్టోర్ చేయబడకుండా చూసుకోవచ్చు. అదనంగా, బ్యాకప్‌ల కోసం గూగుల్ అకౌంట్లను వాడటం ఇష్టపడే వారు కొత్త ఆండ్రాయిడ్ డివైజ్‌కు మారేటప్పుడు వాట్సాప్ చాట్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు.

రెండు ఫోన్‌లు వై-ఫై ఆన్‌లో ఉన్నప్పుడు మాత్రమే ఈ వైర్‌లెస్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ పని చేస్తుంది. ఈ అప్‌డేట్ ద్వారా ఐఓఎస్ వంటి ఇతర ప్లాట్‌ఫారమ్‌లతో ఆండ్రాయిడ్‌లో వాట్సాప్ బ్యాకప్ చేసుకోవడంపై అవగాహన కల్పిస్తోంది. బ్యాకప్‌ల కోసం గూగుల్ సర్వీసులపై ఆధారపడే వినియోగదారులు స్టోరేజీ సెట్టింగ్‌లను వెంటనే మార్చుకోవాలని సూచిస్తోంది.

Read Also : Whatsapp Email Verification : వాట్సాప్‌‌లో కొత్త ఫీచర్.. ఫోన్ లేకున్నా ఈమెయిల్‌తో లాగిన్ చేయొచ్చు.. ఇదేలా పనిచేస్తుందంటే?

ట్రెండింగ్ వార్తలు