SVC 58 : వెంకటేశ్ అనీల్ రావిపూడి సినిమా మొదలు.. సంక్రాంతి బరిలో.. !
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తన కొత్త చిత్రాన్ని ప్రారంభించారు.
- Thota Vamshi Kumar
- Updated on- July 3, 2024 / 03:07 PM IST
Venkatesh Anil Ravipudi movie pooja ceremony complete
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తన కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎఫ్-2, ఎఫ్-3 సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. దీంతో తాజా చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజ్ నిర్మిస్తున్నారు. కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపుదిద్దుకోనున్నట్లు తెలుస్తోంది.
Laila Movie Opening : విశ్వక్ సేన్ ‘లైలా’ మూవీ ఓపెనింగ్ ఫొటోలు..
పూజా కార్యక్రమాలతో ఈ సినిమా మొదలైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ఫోటోలను పంచుకుంది. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలియజేసింది.
ఈ చిత్రంలో మీనాక్షి చౌదరితో పాటు ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం తెలియజేసింది. వీరిద్దరి ఫస్ట్ లుక్‌లను అభిమానులతో పంచుకుంది.
