Riyan Parag : టీమ్ఇండియాకు ఎంపికైన ఆనందంలో పాస్‌పోర్టు, ఫోన్ మ‌రిచిపోయిన రియాన్ ప‌రాగ్‌..

ఐపీఎల్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారించి తొలిసారి టీమ్ఇండియాకు ఎంపిక అయ్యాడు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బ్యాట‌ర్ రియాన్ ప‌రాగ్‌.

ఐపీఎల్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారించి తొలిసారి టీమ్ఇండియాకు ఎంపిక అయ్యాడు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బ్యాట‌ర్ రియాన్ ప‌రాగ్‌. జింబాబ్వేతో 5 మ్యాచుల టీ20 సిరీస్ కోసం శుభ్‌మ‌న్ గిల్ సార‌థ్యంలోని టీమ్ఇండియా బుధ‌వారం హ‌రారేలో అడుగుపెట్టింది. ఈ సంద‌ర్భంగా తొలిసారి టీమ్‌కు ఎంపికైన రియాన్ ప‌రాగ్‌, అభిషేక్ శ‌ర్మ‌, తుషార్ దేశ్‌పాండేలు బీసీసీఐ టీవీతో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ పోస్ట్ చేసింది.

ఈ ముగ్గురు ఆట‌గాళ్లు భార‌త జ‌ట్టుకు ఎంపిక కావ‌డంతో చాలా ఆనందంగా ఉన్నారు. ముఖ్యంగా రియాన్ ప‌రాగ్‌.. ఆనందంలో చిన్న‌పిల్లాడిలా చిన్న త‌ప్పు కూడా చేశాన‌ని చెప్పుకొచ్చాడు. సీనియ‌ర్ ఆట‌గాళ్ల‌తో క‌లిసి ట్రావెలింగ్ చేస్తున్న సంతోషంలో పాస్‌పోర్టు, ఫోన్‌ను మ‌రిచ్చిపోయాను అని చెప్పాడు. కానీ హ‌రారే చేరుకున్న త‌రువాత వాటిని క‌నుగొన్న‌ట్లుగా తెలిపాడు. వాస్త‌వానికి అత‌డి వాటిని మ‌రిచిపోలేదు. వేరే ప్లేస్‌లో పెట్టి మ‌రిచిపోయాడు.

బౌండరీలైన్ వద్ద సూర్య క్యాచ్ పట్టేటప్పుడు రోహిత్ శర్మ రియాక్షన్ చూశారా.. వీడియో వైరల్

‘చిన్న‌నాటి నుంచి భార‌త జ‌ట్టుతో క‌లిసి ప్ర‌యాణించాల‌నేది నా క‌ల‌. ఇప్ప‌టికే చాలా క్రికెట్ ఆడాను. అయితే.. సీనియ‌ర్ జ‌ట్టుతో ట్రావెల్ చేయ‌డం, టీమ్ఇండియా జెర్సీని ధ‌రించ‌డం ఎప్ప‌టికీ ప్ర‌త్యేక‌మే.’ అని రియాన్ ప‌రాగ్ చెప్పాడు. ఐపీఎల్ 2024 సీజ‌న్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున రియాన్ ప‌రాగ్ దుమ్ములేపాడు. 16 మ్యాచ్‌ల్లో 52 సగటుతో 149.22 స్ట్రైక్ రేట్‌తో 573 పరుగులు చేశాడు.

Team India : ఆ ఒక్క ఫోన్ కాల్ టీమ్ఇండియాకు ప్ర‌పంచ‌క‌ప్ తెచ్చిపెట్టింది..!

సన్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ మాట్లాడుతూ.. క్రికెట్ ఆడ‌డం ఆరంభించిన రోజు నుంచి త‌న‌కు దేశం కోసం ఆడాల‌నేది ఓ క‌ల అని చెప్పాడు. క‌ష్ట‌ప‌డితే ఫ‌లితం ఉంటుందనే విష‌యం త‌న‌కు తెలుస‌న్నాడు. అయితే.. భార‌త‌దేశం బ‌య‌ట కూడా స‌త్తాచాటాల‌ని భావిస్తున్న‌ట్లు తెలిపాడు.

ట్రెండింగ్ వార్తలు