Team India : ఆ ఒక్క ఫోన్ కాల్ టీమ్ఇండియాకు ప్ర‌పంచ‌క‌ప్ తెచ్చిపెట్టింది..!

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ విజ‌యంతో హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్ త‌న ప‌ద‌వీకాలాన్ని ఘ‌నంగా ముగించాడు

Team India : ఆ ఒక్క ఫోన్ కాల్ టీమ్ఇండియాకు ప్ర‌పంచ‌క‌ప్ తెచ్చిపెట్టింది..!

Rahul Dravid Thanked Rohit Sharma For November Phone Call

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ విజ‌యంతో హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్ త‌న ప‌ద‌వీకాలాన్ని ఘ‌నంగా ముగించాడు. బార్బ‌డోస్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్ ఏడు ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. త‌ద్వారా 17 ఏళ్ల త‌రువాత టీమ్ఇండియా మ‌రోసారి టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడింది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024తో హెడ్ కోచ్‌గా ద్ర‌విడ్ ప‌ద‌వీకాలం ముగిసింది. ఈ క్ర‌మంలో ఫైన‌ల్ మ్యాచ్ త‌రువాత డ్రెస్సింగ్ రూమ్‌లో ద్ర‌విడ్ వీడ్కోలు ప్ర‌సంగం చేశాడు.

గ‌తేడాది న‌వంబ‌రులో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ త‌న‌కు ఫోన్ చేయ‌క‌పోయి ఉంటే ప్ర‌స్తుతం తాను ఇక్క‌డ ఉండేవాడిని కాద‌ని, ఈ చారిత్ర‌త్మ‌క విజ‌యంలో భాగం అయ్యేవాడిని కాద‌న్నారు. ఇందుకు రోహిత్ శ‌ర్మకు ద్ర‌విడ్ ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశాడు.

T20 World Cup 2026 : 2026 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లోనూ 20 జ‌ట్లు.. ఆతిథ్యం ఎవ‌రంటే..? ఇప్ప‌టికే 12 అర్హ‌త‌.. ఇంకా..

స్వ‌దేశంలో గ‌తేడాది న‌వంబ‌ర్‌లో జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త జ‌ట్టు వ‌రుస విజ‌యాల‌తో ఫైన‌ల్‌కు చేరింది. అయితే.. ఆఖ‌రి మ్యాచులో ఆస్ట్రేలియా చేతిలో ఓట‌మి పాలైంది. ఈ స‌మ‌యంలో టీమ్ఇండియా హెడ్ కోచ్‌ ప‌ద‌వి నుంచి ద్ర‌విడ్ త‌ప్పుకోవాల‌ని భావించాడ‌ట‌. అయితే.. ఆ స‌మ‌యంలో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఫోన్ చేసి క‌నీసం టీ20 ప్ర‌పంచ‌క‌ప్ వ‌ర‌కు అయినా కోచ్‌గా కొన‌సాగాల‌ని ద్ర‌విడ్‌ను ఒప్పించాడ‌ట‌.

ఈ విష‌యాన్నే ద్ర‌విడ్ చెప్పాడు. ‘రో.. గ‌తేడాది నువ్వు న‌వంబ‌ర్‌లో నాకు కాల్ చేసి కోచ్‌గా ఉండాల‌ని అడిగావు. ఇందుకు చాలా కృత‌జ్ఞ‌త‌లు.’ అని ద్ర‌విడ్ అన్నాడు. ప్ర‌స్తుతం త‌న‌కు మాట‌లు రావ‌డం లేద‌న్నాడు. ఈ సుదీర్ఘ ప్ర‌యాణంలో త‌న‌కు స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశాడు. జ‌ట్టులోని ప్ర‌తి ఒక్క‌రితో ప‌ని చేయ‌డం త‌న‌కు గ‌ర్వంగా, ఆనందంగా ఉంద‌న్నాడు. ఈ టోర్నీలో ఆట‌గాళ్లంతా అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చార‌న్నాడు.

Rohit Sharma : ఎట్ట‌కేల‌కు మ‌ట్టిని తిన‌డానికి గ‌ల కార‌ణాల‌ను చెప్పిన రోహిత్ శ‌ర్మ‌..

ఇక ఈ విజ‌యాన్ని అంద‌రూ ఆస్వాదించాల‌ని సూచించాడు. ఈ క్ష‌ణాలు చిర‌కాలం గుర్తుండిపోతాయ‌న్నారు. ప‌రుగులు, వికెట్ల‌ను ప‌క్క‌న ప‌క్క‌న‌బెట్టొచ్చు.. మీ కెరీర్‌ను మీరు మ‌రిచిపోవ‌చ్చు.. గానీ ఇలాంటి మ‌ధుర‌మైన క్ష‌ణాలు మ‌దిలో నిలిచిపోతాయ‌న్నాడు.