బౌండరీలైన్ వద్ద సూర్య క్యాచ్ పట్టేటప్పుడు రోహిత్ శర్మ రియాక్షన్ చూశారా.. వీడియో వైరల్

సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పట్టేందుకు బౌండరీ వైపు దూసుకెళ్తున్న సమయంలో అతనికి కొద్దిదూరంలో బౌండరీ లైన్ వద్ద భారత్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు.

బౌండరీలైన్ వద్ద సూర్య క్యాచ్ పట్టేటప్పుడు రోహిత్ శర్మ రియాక్షన్ చూశారా.. వీడియో వైరల్

Suryakumar Yadav Catch

Suryakumar Yadav Catch : టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య చివరి వరకు నువ్వానేనా అన్నట్లు పోరు జరిగింది. చివరి ఓవర్లో బౌండరీ లైన్ వద్ద సూర్యకుమార్ యాదవ్ పట్టిన అద్భుత క్యాచ్ తో టీమిండియా విజయతీరాలకు చేరింది. ఫైనల్ మ్యాచ్ లో భాగంగా చివరి ఓవర్లో దక్షిణాఫ్రికా జట్టు 16 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేశాడు. ఓవర్ తొలి బంతిని మిల్లర్ లాంగ్ ఆఫ్ దిశగా సిక్స్ కొట్టే ప్రయత్నం చేశాడు. బంతి బౌండరీ లైన్ బయట పడుతున్న సమయంలో వేగంగా దూసుకొచ్చిన సూర్య అద్భుత క్యాచ్ అందుకున్నాడు.

Also Read : David Miller : టీ20 ఫార్మాట్ కు డేవిడ్ మిల్లర్ రిటైర్మెంట్..? షాకింగ్ విషయం ఏమిటంటే..

సూర్య అందుకున్న క్యాచ్ పై వివాదం నెలకొంది. కొందరు మాజీ క్రికెటర్లు, సౌతాఫ్రికా ఫ్యాన్స్ సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ పై తమ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్యాచ్ పట్టే సమయంలో సూర్య కాలు బౌండరీ లైన్ తాకిందని వితండవాదం చేస్తున్నారు. మరికొందరు.. బౌండరీ రోప్ జరిపినట్లు ఆరోపిస్తున్నారు. మరికొందరు మాత్రం సూర్య అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడని.. అతని కాలు బౌండరీకి తాకలేదని పేర్కొంటున్నారు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ షాన్ పొలాక్ సూర్యకు మద్దతుగా నిలిచాడు. సూర్య కుమార్ పట్టిన క్యాచ్ లో ఎలాంటి వివాదం లేదని పేర్కొన్నాడు. గత రెండు రోజులుగా సూర్య పట్టిన క్యాచ్ పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. ఇదే సమయంలో సూర్య క్యాచ్ పట్టే సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ రియాక్షన్ వైరల్ అయింది.

Also Read : Team India : ఆ ఒక్క ఫోన్ కాల్ టీమ్ఇండియాకు ప్ర‌పంచ‌క‌ప్ తెచ్చిపెట్టింది..!

సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పట్టేందుకు బౌండరీ వైపు దూసుకెళ్తున్న సమయంలో అతనికి కొద్దిదూరంలో బౌండరీ లైన్ వద్ద భారత్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. సూర్య క్యాచ్ పట్టే సమయంలో రోహిత్ శర్మ రియాక్షన్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సూర్య క్యాచ్ పట్టగలడా అన్న ఆందోళనలో రోహిత్ ఉన్నట్లు కనిపించింది.