Honor 200 5G Series : భారత్‌కు రానున్న హానర్ 200 5జీ సిరీస్ ఫోన్లు.. ధర వివరాలు, ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Honor 200 5G Series : హానర్ 200, హానర్ 200ప్రో ల్యాండింగ్ పేజీలోనూ ప్రస్తుతం అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లోనూ లైవ్‌లో ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల కచ్చితమైన లాంచ్ తేదీని పేర్కొనలేదు.

Honor 200 5G Series : కొత్త ఫోన్ కొంటున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ హానర్ నుంచి 2 రెండు సరికొత్త ఫోన్లు రాబోతున్నాయి. ఇప్పటికే ఈ రెండు మోడల్స్ యూకేలో హానర్ 200, హానర్ 200ప్రో పేరుతో లాంచ్ అయ్యాయి. అతి త్వరలో భారత మార్కెట్లో కూడా లాంచ్ కానున్నాయి. హానర్ కంపెనీ లాంచ్ అధికారిక తేదీని ఇంకా ప్రకటించలేదు.

Read Also : Vivo T3 Lite 5G Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? వివో టీ3 లైట్ 5జీ వచ్చేసిందోచ్.. భారత్‌లో ధర ఎంతో తెలుసా?

అంతకంటే ముందే, అమెజాన్ ఫోన్లను జాబితా చేసింది. లిస్టింగ్ త్వరలో రాబోతున్న ట్యాగ్‌తో ఫోన్‌లను సూచిస్తోంది. హానర్ 200 స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 ఎస్ఓసీపై రన్ అవుతుంది. అయితే, హానర్ ప్రో వెర్షన్‌లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 చిప్‌సెట్ హుడ్ కింద ఉంది. రెండు ఫోన్‌లు ఓఎల్ఈడీలు ఫుల్-హెచ్‌డీ+ స్క్రీన్‌లు, 100డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,200mAh బ్యాటరీలు, 50ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌లను కలిగి ఉన్నాయి.

అమెజాన్‌లో హానర్ 200 సిరీస్ ఫోన్ :
హానర్ 200, హానర్ 200ప్రో ల్యాండింగ్ పేజీలోనూ ప్రస్తుతం అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లోనూ లైవ్‌లో ఉంది. అయితే, ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల కచ్చితమైన లాంచ్ తేదీని పేర్కొనలేదు కానీ, అతి ‘త్వరలో రాబోతున్నాయి’ అనే ట్యాగ్‌తో జాబితా చేసింది.

ఆసక్తి ఉన్న కస్టమర్‌లు లాంచ్ గురించి లేటెస్ట్ అప్‌డేట్‌లను పొందడానికి ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌లోని “Notify Me” బటన్‌పై క్లిక్ చేయవచ్చు. లిస్టింగ్ హానర్ 200 సిరీస్‌లో ట్రిపుల్ రియర్ కెమెరాలు 5జీ కనెక్టివిటీతో బ్యాక్ డిజైన్‌తో వస్తాయి. ఇటీవల, ELP-NX9 మోడల్ నంబర్‌తో హానర్ 200 ప్రో బీఐఎస్ వెబ్‌సైట్‌లో కనిపించింది. హానర్ లైనప్ కచ్చితమైన లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే, బ్రాండ్ రెండు ఫోన్‌లను జూలైలో ఆవిష్కరించాలని భావిస్తోంది.

హానర్ 200 సిరీస్ ధర, స్పెసిఫికేషన్లు :
యూకేలో హానర్ 200 సిరీస్ ధర జీబీపీ 499.99 (దాదాపు రూ. 53,500), అయితే హానర్ 200 ప్రో ధర జీబీపీ 699.99 (దాదాపు రూ. 74,800) ఉంటుంది. హానర్ 200, హానర్ 200ప్రో ఆండ్రాయిడ్ 14 ఆధారంగా మ్యాజిక్ఓఎస్ 8.0పై రన్ అవుతాయి. ఫుల్-హెచ్‌డీ+ (1,224 x2,700 పిక్సెల్‌లు) స్క్రీన్‌లను కలిగి ఉంటాయి. హానర్ ప్రో మోడల్ 6.78 డిస్‌ప్లే కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. వనిల్లా మోడల్ 6.7-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది.

స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 చిప్‌తో పనిచేస్తుంది. ఈ రెండు ఫోన్‌లు 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 50ఎంపీ టెలిఫోటో కెమెరా, 12ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ మాక్రో కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ కలిగి ఉన్నాయి. 50ఎంపీ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. హానర్ 200, హానర్ 200ప్రో రెండూ 100డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,200mAh బ్యాటరీ యూనిట్లు ఉంటాయి. హానర్ ప్రో మోడల్ 66డబ్ల్యూ వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది.

Read Also : Vivo Y28s 5G Launch : భారత్‌కు వివో Y28s 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర ఎంతో తెలిసిందోచ్!

ట్రెండింగ్ వార్తలు