Realme 13 Pro Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ నెల 30 నుంచే రియల్‌మి 13ప్రో సేల్.. ధర, స్పెషిఫికేషన్లు..!

Realme 13 Pro Sale : రియల్‌మి 13ప్రో ఊహించిన స్పెషిఫికేషన్లలో ఆండ్రాయిడ్ వి14లో రన్ అవుతుంది. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుందని సూచిస్తున్నాయి.

Realme 13 Pro to go on Sale on July 30 on Flipkart

Realme 13 Pro Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లో జూలై 30న రియల్‌మి 13 ప్రోని రిలీజ్ చేసేందుకు రెడీగా ఉంది. ఆసక్తికరంగా, ప్రారంభ యాక్సెస్ సేల్ ద్వారా ఫోన్ లాంచ్ చేసిన రోజున కొనుగోలుదారులకు రియల్‌మి అనుమతిస్తుంది. రియల్‌మి 13 ప్రో సిరీస్ 5జీ ప్రారంభ యాక్సెస్ సేల్ మొదలు కానుంది.

Read Also : iPhone 13 Price Drop : అమెజాన్ ప్రైమ్ డే 2024 సేల్.. ఆపిల్ ఐఫోన్ 13పై భారీ తగ్గింపు.. మరెన్నో బ్యాంక్ డిస్కౌంట్లు!

జూలై 30 నుంచి రియల్‌మి వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లోఉదయం 06:00 నుంచి రాత్రి 10:00 వరకు అందుబాటులో ఉంటుంది. రియల్‌మి కొనుగోలుదారులు రూ. 3వేల విలువైన బ్యాంక్ ఆఫర్ బెనిఫిట్స్ పొందవచ్చు. 12 నెలల నో-కాస్ట్ ఈఎంఐ నుంచి ప్రయోజనం పొందవచ్చు.

రియల్‌మి 13ప్రో ఫీచర్లు :
రియల్‌మి 13ప్రో ఊహించిన స్పెషిఫికేషన్లలో ఆండ్రాయిడ్ వి14లో రన్ అవుతుంది. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుందని సూచిస్తున్నాయి. రియల్‌మి డిస్‌ప్లే 1080x 2412 పిక్సెల్‌ల రిజల్యూషన్, 393పీపీఐ పిక్సెల్ డెన్సిటీతో 6.74-అంగుళాల అమోల్డ్ స్క్రీన్‌గా అంచనా. హై కాంట్రాస్ట్ రేషియో సర్దుబాటు, 100 శాతం డీసీఐ-పీ3 కలర్, 3160హెచ్‌జెడ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్‌ను అందిస్తుంది. స్క్రీన్ పంచ్-హోల్ డిజైన్‌తో 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 360 Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.

కెమెరా పరంగా రియల్‌మి 13ప్రో 120ఎఫ్‌పీఎస్ వద్ద 1080పీ వీడియోను రికార్డ్ చేయగల సామర్థ్యంతో 50ఎంపీ, 50ఎంపీ, 32ఎంపీ సెన్సార్లను కలిగి ఉండే ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఫ్రంట్ కెమెరా 32ఎంపీ షూటర్‌గా ఉండే అవకాశం ఉంది. ఈ డివైజ్ 2.4జీహెచ్‌జెడ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో కూడిన క్వాల్‌కామ్ స్నాప్‌‌డ్రాగన్ 7 జనరేషన్1 చిప్‌సెట్‌తో 8జీబీ ర్యామ్, అదనంగా 8జీబీ వర్చువల్ ర్యామ్ అందిస్తుందని భావిస్తున్నారు.

మెమరీ కార్డ్‌లకు సపోర్టు లేకుండా ఇంటర్నల్ స్టోరేజీ 128జీబీగా అంచనా. కనెక్టివిటీ ఆప్షన్లలో 4జీ, 5జీ, వివోఎల్టీఈ, బ్లూటూత్ వి5.3, వై-ఫై, యూఎస్‌బీ టైప్-సి వి2.0 పోర్ట్ ఉండాలి. బ్యాటరీ 80డబ్ల్యూ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh యూనిట్‌గా ఉంటుందని భావిస్తున్నారు. అదనపు ఫీచర్లు ఎమ్ రేడియో, 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్, వాటర్‌ఫ్రూఫింగ్ సూచిస్తున్నాయి. ఈ స్పెసిఫికేషన్‌లను అధికారికంగా ప్రకటించనుంది.

Read Also : Apple iPhone Prices : ఆపిల్ లవర్స్‌కు పండగే.. దిగొచ్చిన ఐఫోన్ల ధరలు.. ప్రో మోడల్స్‌పై ఫస్ట్ టైం తగ్గింపు..!

ట్రెండింగ్ వార్తలు