Redmi 13C Launch : భారత్‌కు రెడ్‌మి 13C 4G బడ్జెట్ ఫోన్ వస్తోంది.. ఈ తేదీనే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Redmi 13C Launch : రెడ్‌మి కొత్త బడ్జెట్ ఫోన్ రెడ్‌మి 13సి ఫోన్‌ని డిసెంబర్ 6న భారత మార్కెట్‌లో లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో రెండు కలర్ ఆప్షన్లు, పవర్‌ఫుల్ 50ఎంపీ ఏఐ కెమెరా వంటి స్టాండ్‌అవుట్ ఫీచర్లు ఉంటాయని భావిస్తున్నారు.

Redmi 13C Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రెడ్‌మీ కొత్త బడ్జెట్ ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. వరుస లీక్‌లు, పుకార్ల తర్వాత కొత్త రెడ్‌మి 13సి లాంచ్‌ను ఎట్టకేలకు ధృవీకరించింది. ఈ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో డిసెంబర్ 6న ఆవిష్కరించనున్నట్టు కంపెనీ ట్విట్టర్ (X) వేదికగా ధృవీకరించింది. ఈ కొత్త ఫోన్ లాంచ్‌ను ప్రకటిస్తూ (Redmi X)లో పోస్ట్ చేసింది. ఇటీవలే షావోమీ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెడ్‌మి ఫోన్ గురించి కీలక వివరాలను రివీల్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ ప్రొడక్టు పేజీ (mi.com/in)లో లైవ్ చేసింది.

Read Also : Redmi 13C 4G Launch : రెడ్‌మి 13C 4G ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

ఈ రాబోయే రెడ్‌మి ఫోన్ ప్రత్యేకమైన ఫీచర్లతో రానుంది. అంతేకాదు.. స్టార్‌డస్ట్ బ్లాక్, స్టార్‌షైన్ గ్రీన్ అనే రెండు అద్భుతమైన కలర్ ఆప్షన్లలో రానుంది. అదనంగా, షావోమీ శక్తివంతమైన 50ఎంపీ ఏఐ కెమెరాను అందించనున్నట్టు ధృవీకరించింది. అసాధారణమైన ఫొటో క్వాలిటీని అందించనుంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించనుంది.

4జీ సపోర్టుతో ధర రూ.15వేలు (అంచనా)  :
వినియోగదారులకు మల్టీఫేస్ ఫొటోగ్రఫీ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ విజువల్స్ ఫ్లాట్ లేఅవుట్, డిస్‌ప్లేతో కూడిన డిజైన్‌ను సూచిస్తాయి. ముఖ్యంగా, ఫోన్ వెనుకవైపు దృష్టిని ఆకర్షిస్తున్న రెండు ఆకర్షణీయమైన కెమెరా విభాగాలను అందిస్తుంది. మొదటి కెమెరా హౌసింగ్‌లో ఒకే కెమెరా ఉంటుంది, రెండవది, బిగ్ హౌసింగ్‌లో రెండు కెమెరా సెన్సార్‌లు ఉంటాయి.

ఈ రెండూ ఫోటోగ్రాఫిక్ సామర్థ్యాలను సూచిస్తుంది. ఫోన్ స్పెసిఫికేషన్‌లపై మరింత సమగ్రమైన వివరాలను షావోమీ ఇంకా వెల్లడించలేదు. నైజీరియాలో కంపెనీ ఆవిష్కరించిన రెడ్‌మి 13సి బడ్జెట్ ఫోన్ మీడియాటెక్ హెలియో జీ85 చిప్‌ని కలిగి ఉంది. 4జీ కనెక్టివిటీకి సపోర్టును అందిస్తుంది. ఈ ఫోన్ ధర రూ. 15వేలు ఉండవచ్చు. గరిష్టంగా 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు స్టోరేజీతో వస్తుంది.

Redmi 13C launch

రెడ్‌మి 13సి స్పెసిఫికేషన్స్ (అంచనా) :
ఇతర మార్కెట్లలో లాంచ్ అయిన రెడ్‌మి 13సి 4జీ వేరియంట్ ఆక్టా -కోర్ 12ఎన్ఎమ్ మీడియాటెక్ హెలియో జీ85 చిప్ ద్వారా పవర్ అందిస్తుంది. 4జీబీ + 128జీబీ, 6జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 13-ఆధారిత ఎంఐయూఐ 14 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతుంది. ఈ రెడ్‌మి హ్యాండ్‌సెట్‌ను 6.74-అంగుళాల (720×1,600 పిక్సెల్‌లు) ఎల్‌సీడీ స్క్రీన్‌తో 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో గరిష్టంగా 450నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌తో అమర్చింది.

ఫోన్ ఎఫ్/1.8 ఎపర్చరుతో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.4 ఎపర్చర్‌తో 2ఎంపీ మాక్రో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో చాట్‌లకు ఎఫ్/2.0 ఎపర్చర్‌తో 8ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. రెడ్‌మి 13సి 4జీ ఎల్‌టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై 5, బ్లూటూత్ 5.3, జీపీఎస్, 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌కు సపోర్టు ఇస్తుంది. బోర్డ్‌లోని సెన్సార్‌లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్, వర్చువల్ ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి. 18డబ్ల్యూ యూఎస్‌బీ-పీడీ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది.

Read Also : Xiaomi Redmi Note 13 Pro : రెడ్‌మి నోట్ 13 ప్రో సిరీస్ గ్లోబల్ లాంచ్‌పై కొత్త లీక్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు