Samsung Galaxy Watch 7 : కొత్త వాచ్ కోసం చూస్తున్నారా? 3 విభిన్న వేరియంట్లలో శాంసంగ్ గెలాక్సీ వాచ్ 7 సిరీస్ వచ్చేస్తోంది!

Samsung Galaxy Watch 7 : శాంసంగ్ గెలాక్సీ వాచ్ 7 మొత్తం మూడు వెర్షన్‌లను లాంచ్ చేస్తుందని మీడియా నివేదిక పేర్కొంది. ప్రతి వేరియంట్ వై-ఫై, ఇసిమ్ వెర్షన్‌లలో వస్తుందని అంచనా.

Samsung Galaxy Watch 7 : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి మూడు విభిన్న వేరియంట్లలో గెలాక్సీ వాచ్ 7 సిరీస్ లాంచ్ కానుంది. ఈ గెలాక్సీ కొత్త వాచ్‌తో పాటు గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 స్మార్ట్‌ఫోన్‌లు కూడా ఈ ఏడాదిలో లాంచ్ కానున్నాయని అంచనా. ఫ్లాగ్‌షిప్ వేరబుల్ లైనప్ గత ఏడాదిలో గెలాక్సీ వాచ్ 6 సిరీస్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌‌గా వచ్చింది.

Read Also : Apple CEO Tim Cook : హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఆపిల్ సీఈఓ టిమ్ కుక్.. ఐఫోన్‌తో తీసిన ఫొటో షేరింగ్..!

ఇప్పుడు, శాంసంగ్ గెలాక్సీ వాచ్ 7 మొత్తం మూడు వెర్షన్‌లను లాంచ్ చేస్తుందని మీడియా నివేదిక పేర్కొంది. ప్రతి వేరియంట్ వై-ఫై, ఇసిమ్ వెర్షన్‌లలో వస్తుందని అంచనా. నివేదికలో రాబోయే కొత్త వాచ్ మోడల్ నంబర్‌లను వెల్లడించింది. శాంసంగ్ గెలాక్సీ వాచ్ 7 సిరీస్‌లో 32జీబీ స్టోరేజీతో అందించనుంది.

విభిన్న వేరియంట్లతో కొత్త వాచ్ మోడల్ నెంబర్లు :
శామ్‌మొబైల్ నివేదిక ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ వాచ్ 7 మూడు వెర్షన్‌లను ఈ ఏడాదిలోనే లాంచ్ చేస్తుంది. ఈ మోడల్‌లు వై-ఫై ఓన్లీ, వై-ఫై, ఇసిమ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటాయి. గెలాక్సీ వాచ్ 6 బేస్ మోడల్, క్లాసిక్ అనే రెండు వేరియంట్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. గెలాక్సీ వాచ్ 7 మొదటి వేరియంట్‌లో (SM-L300, SM-L305) అనే రెండు మోడల్ నంబర్‌లు ఉన్నాయి. అదేవిధంగా, మిడిల్ వేరియంట్ మోడల్ నంబర్‌లు (SM-L310, SM-L315)గా కంపెనీ చెబుతోంది.

32జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్ :
అయితే, వేరబుల్ టాప్-ఎండ్ వేరియంట్ (SM-L700, SM-L705) మోడల్ నంబర్‌లతో రానున్నాయి. ఐదవ సంఖ్యతో ముగిసే ఈ మోడల్ నంబర్‌లు సెల్యులార్ కనెక్టివిటీ, (eSIM) సపోర్టు అందించగలవు. అంతేకాదు.. శాంసంగ్ గెలాక్సీ వాచ్ 7 మోడల్ 32జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుందని నివేదిక పేర్కొంది. గతంలో కన్నా గణనీయమైన అప్‌గ్రేడ్ కానుంది. గెలాక్సీ వాచ్ 6 సిరీస్ 16జీబీ ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది.

కొత్త గెలాక్సీ వాచ్ 7 లైనప్ నెక్స్ట్ట్ జనరేషన్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు వచ్చే శాంసంగ్ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఈవెంట్ జూలైలో పారిస్‌లో జరగనుందని భావిస్తున్నారు. గత లీక్‌ల ప్రకారం.. గెలాక్సీ వాచ్ 7 మోడల్ 3ఎన్ఎమ్ చిప్‌తో వేర్ ఓఎస్, వన్ యూఐ వాచ్ కొత్త వెర్షన్‌తో రన్ అవుతుంది.

గెలాక్సీ వాచ్ 6 తో పోలిస్తే.. 50 శాతం ఎక్కువ పవర్-ఎఫెక్టివ్‌గా ఉండనుంది. ప్రస్తుతం భారత్‌లో అవుట్‌గోయింగ్ గెలాక్సీ వాచ్ 6 బేస్ బ్లూటూత్ వేరియంట్ ధర రూ.19,999, గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ ప్రారంభ ధర రూ. 36,999కు అందుబాటులో ఉన్నాయి.

Read Also : IBM Cut Jobs : ఐబీఎం ఉద్యోగులకు షాక్.. ఆ రెండు విభాగాల్లోనే భారీగా కోతలు!

ట్రెండింగ్ వార్తలు