Vivo Y100i Launch : భారీ బ్యాటరీతో వివో Y100ఐ ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతంటే?

Vivo Y100i Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, వివో నుంచి సరికొత్త ఫోన్ వచ్చేసింది. భారీ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ఎస్ఓసీ‌పై రన్ అవుతుంది. ఫీచర్లు, ధర వివరాలను ఓసారి చూద్దాం..

Vivo Y100i Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో నుంచి సరికొత్త ఫోన్ వివో వై100ఐ గురువారం (నవంబర్ 30) చైనాలో లాంచ్ అయింది. వివో లేటెస్ట్ వై-సిరీస్ స్మార్ట్‌ఫోన్ 60హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.64-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. వివో వై100ఐ 12జీబీ ర్యామ్ 512జీబీ స్టోరేజీతో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ఎస్ఓసీపై రన్ అవుతుంది. 50ఎంపీ ప్రైమరీ సెన్సార్ నేతృత్వంలోని డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌కు 44డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీ ఉంది. వివో వై100ఐ ఐపీ54 డస్ట్, స్ప్లాష్-రెసిస్టెంట్ రేటింగ్‌ను కలిగి ఉంది.

Read Also : Vivo S18 Series : వివో S18 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!

వివో వై100ఐ ధర ఎంత? :
వివో వై100ఐ ఫోన్ ఏకైక 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సీఎన్‌వై 1,599 (దాదాపు రూ. 15వేలు) ధర ఉంటుంది. ప్రస్తుతం చైనాలో వివో ఆన్‌లైన్ స్టోర్ ద్వారా (Xiangyun) పౌడర్ (పింక్), స్కై బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. భారత్ సహా ఇతర మార్కెట్లలో వివో వై100ఐ లభ్యత వివరాలు ఇంకా ధృవీకరించలేదు. వివో వై100 ఫోన్.. భారత మార్కెట్లో ఫిబ్రవరిలో సింగిల్ 8జీబీ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 24,999కు పొందవచ్చు.

వివో వై100ఐ స్పెసిఫికేషన్లు :
వివో వై100ఐ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆర్జిన్ఓఎస్ 3పై రన్ అవుతుంది. 60హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 91.6 స్క్రీన్-టు-బాడీ రేషియోతో 6.64-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (1,080×2,388 పిక్సెల్‌లు) స్క్రీన్‌ను కలిగి ఉంది. డిస్‌ప్లే కేంద్రంగా ఉన్న హోల్ పంచ్ కటౌట్‌ను కూడా కలిగి ఉంది.

Vivo Y100i Launched

ఆక్టా-కోర్ 7ఎన్ఎమ్ మీడియా టెక్ డైమెన్సిటీ 6020 ఎస్ఓసీ, 12జీబీ ఎల్‌పీడీడీ‌ఆర్4ఎక్స్ ర్యామ్ మాలి-జీ57 ఎంసీ2తో అందిస్తుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్‌ని ఉపయోగించి ఆన్‌బోర్డ్ మెమరీని 24జీబీ వరకు విస్తరించవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 512జీబీ యూఎఫ్ఎస్2.2 స్టోరేజ్ వరకు వస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. వివో వై100ఐ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్/1.8 ఎపర్చరుతో 50ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు ఎఫ్/2.4 ఎపర్చరు లెన్స్‌తో 2ఎంపీ సెన్సార్ ఉంటుంది.

కెమెరా ఫీచర్లు, మరెన్నో కనెక్టివిటీ ఆప్షన్లు :
సెల్ఫీలు, వీడియో చాట్‌లకు ఎఫ్/2.0 ఎపర్చరు లెన్స్‌తో 8ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. వివో వై100iలో వై-ఫై, బ్లూటూత్ 5.1, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, జీపీఎస్, ఎ-జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్, సామీప్య సెన్సార్ ఉన్నాయి.

అథెంటికేషన్ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఐపీ54 రేటింగ్‌ను కూడా అందిస్తుంది. వివో వై100ఐ 44డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ కొలతలు 164.06×76.17×8.7ఎమ్ఎమ్, బరువు 190 గ్రాములు ఉంటుంది.

Read Also : Google Accounts Delete : డిసెంబర్ 1 నుంచి గూగుల్ ఇలాంటి అకౌంట్లను డిలీట్ చేస్తుంది.. పూర్తి వివరాలివే!

ట్రెండింగ్ వార్తలు