Japan Grandpa Gang : జపాన్‌లో ‘గ్రాండ్‌పా గ్యాంగ్’.. జట్టుగా దోపిడీలు చేస్తున్న ముగ్గురు వృద్ధులు.. తాళం వేసిన ఇళ్లే టార్గెట్!

Japan Grandpa Gang : ఇదంతా చూస్తుంటే.. ఏదో హాలీవుడ్ థ్రిల్లర్ మూవీలా అనిపిస్తుంది కదా.. అచ్చం అలానే ఉంది.. సినిమాల్లో మాదిరిగా ఇక్కడ ముగ్గురు జైలులో కలుసుకుంటారు. ఆ తరువాత జట్టుగా దోపిడీలు చేస్తారు. 

Japan's 'Grandpa Gang'_ Three Old Men ( Image Source : Google )

Japan Grandpa Gang : జపాన్‌లో ‘గ్రాండ్‌పా గ్యాంగ్’ అక్కడి ప్రజలను టెన్షన్ పుట్టిస్తోంది. వాస్తవానికి ఈ వయస్సులో పనిచేయడమే కష్టం. అలాంటిది ఏకంగా దోపిడీలకు పాల్పుడుతున్నారు. ఎక్కడి నుంచి వస్తారో తెలియదు.. జట్టుగా వచ్చి దోపిడీలకు పాల్పడుతుంటారు. తాళం వేసిన ఇళ్లనే వీరు టార్గెట్ చేస్తుంటారు. ఇలా వస్తారు.. అలా అన్ని దోచుకుపోతారు..

Read Also : Zomato Delivery Boy : ఉండేది ముంబై మురికివాడలో.. నెలకు అద్దె రూ. 500.. జొమాటో డెలివరీ బాయ్ రియల్ లైఫ్ స్టోరీ..!

ఇదంతా చూస్తుంటే.. ఏదో హాలీవుడ్ థ్రిల్లర్ మూవీలా అనిపిస్తుంది కదా.. అచ్చం అలానే ఉంది.. సినిమాల్లో మాదిరిగా ఇక్కడ ముగ్గురు జైలులో కలుసుకుంటారు. ఆ తరువాత జట్టుగా దోపిడీలు చేస్తారు. జపాన్‌లో ఇలాంటి పరిస్థితి ఏర్పడటంతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే.. ఆ ముగ్గురూ దొంగలు 70 ఏళ్లు పైబడిన వారే. తత్ఫలితంగా, జపాన్‌లోని ఈ వృద్ధ ముగ్గురిని “తాత గ్యాంగ్” అని పిలుస్తారు.

ది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. వృద్ధులు ముగ్గురూ జపాన్‌లో నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. పోలీసులు వీరిని “G3S”గా పిలుస్తారు. అంటే.. ‘తాతయ్యలు’ అనే జపనీస్ పదాన్ని వాడుతారు. ఉత్తర ద్వీపం హక్కైడోలో ‘జీ’ గ్రూప్ వరుస చోరీలకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

తాతల దొంగల ముఠా వీరే : 
హిడియో ఉమినో, 88, హిడెమి మత్సుడా, 70, కెనిచి వటనాబే, 69 అనే ముగ్గురు వృద్ధులు జైలులో శిక్ష అనుభవిస్తున్నప్పుడు వారి నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఈ ముగ్గురూ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతూనే ఎవరూ లేని ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దోచుకుంటారు.

గత మేలో ఈ గ్యాంగ్ హక్కైడో రాజధాని సపోరోలోని ఇంట్లోకి చొరబడింది. 200 యెన్లు (1.3 అమెరికా డాలర్లు) నగదు, మూడు సీసాల విస్కీ మొత్తం 10వేల యెన్లు (65 అమెరికా డాలర్లు)ను దోచుకెళ్లారు. అంతటితో ఆగకుండా ఈ ముగ్గురూ ఆ తర్వాత నెలలో మళ్లీ దోపిడీకి పాల్పడినట్టుగా అక్కడి పోలీసులు అనుమానిస్తున్నారు. ఈసారి అదే ప్రాంతంలోని ఖాళీగా ఉన్న మరో నివాసం నుంచి ఒక మిలియన్ యెన్ (6,400 అమెరికా డాలర్లు) విలువైన 24 ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వృద్ధుల ముఠాపై నేరాల గురించి వార్తలు రావడంతో సంచలనంగా మారారు.

Read Also : Trump FBI Director : మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు నిజంగానే బుల్లెట్ తగిలిందా? ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ లేవనెత్తిన అనుమానాలు..!

ట్రెండింగ్ వార్తలు