Man Sexually Assaults Cows : ఆవులపై అత్యాచారం చేస్తున్నాడు…. రైతుల ఆందోళన

కేరళ లోని  కొల్లాం జిల్లా మయనాడ్ లోని    రైతులు విచిత్ర సమస్య ఎదుర్కొన్నారు.  ఒక వ్యక్తి రైతులకు చెందిన ఆవులపై లైంగిక దాడి చేస్తున్నాడు.

Man Sexually Assaults Cows : కేరళ లోని  కొల్లాం జిల్లా మయనాడ్ లోని   రైతులు విచిత్ర సమస్య ఎదుర్కొన్నారు.  ఒక వ్యక్తి రైతులకు చెందిన ఆవులపై లైంగిక దాడి చేస్తున్నాడు. దీంతో రైతులు తమ ఆవులను అమ్మేసుకుంటున్నారు.దాదాపు 20 మంది బాధితరైతులు తమ వద్ద ఉన్నఆవులను అమ్మేసారు.

ఈ ఏడాది జనవరి నుంచి తరచుగా ఆవులపై దాడి జరుగుతోంది. చాలా రోజుల వరకు వారికి ఈ విషయం తెలియలేదు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిందితుడిని గుర్తించాకే అది లైంగిక దాడి అని తెలుసుకున్నారు.  బాధితుల్లోని తంబి అనే రైతుకు ఏడు ఆవులు ఉండేవి.. వాటిలో నాలుగింటిని అమ్మేశాడు. కారణం వాటిపై ఐదుసార్లు అత్యాచారం జరగటం.

ఆవులను కట్టేసి కొట్టటమే కాకుండా నిందితుడు వాటి జననాంగాల్లోకర్ర్రలను చొప్పించేవాడుట….. పోదుగులను రాళ్లతో కొట్టి గాయపరిచేవాడని రైతులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కోన్నారు. ఆవులకు శస్త్ర చికిత్సలు చేయించలేక  చాలా మంది రైతులు ఆవులను అమ్మేసుకుంటున్నారు. మొదట్లో ఎవరో వ్యక్తిగత కక్షతో మా ఆవులపై దాడి చేస్తున్నారనుకున్నాను. కానీ ఇదే సమస్య అందరూ లేవనెత్తారని… అప్పుడే తెలిసింది.  ఈ వ్యక్తి అసహజ రీతితో ఆవులపై లైంగిక దాడి చేస్తున్నాడని తంబి అనే రైతు తెలిపాడు.

ఇలాంటి సమస్య  ఎదుర్కోంటున్న  20మంది పాడి రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైతులంతా నిఘా పెట్టి నిందితుడిని పోలీసులకు పట్టిచ్చారు. కానీ పోలీసులు సరైన ఆధారాలు లేనందున అతడ్ని విడిచి పెట్టారు. రైతులు అనుమానిస్తున్న వ్యక్తి మానసిక స్ధితి సరిగాలేదని… ఈ వ్యవహారంపై పూర్తి స్ధాయి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

 

ట్రెండింగ్ వార్తలు