IPL 2024 : చిన్నస్వామి స్టేడియంలో హర్లీన్ డియోల్‌కు బ్యాటింగ్ చిట్కాలు చెప్పిన శుభ్‌మాన్ గిల్.. వీడియో వైరల్

ఐపీఎల్ 2024 సీజన్ లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు శుభ్‌మాన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సీజన్ లో గుజరాత్ మొత్తం 10 మ్యాచ్ లు ఆడగా.. కేవలం నాలుగు మ్యాచ్ లలోనే విజయం సాధించింది.

Shubman Gill and Harleen Deol

Shubman Gill – Harleen Deol : ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా శనివారం గుజరాత్ టైటాన్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ఎం. చిన్నస్వామి స్టేడియంలో తలపడనుంది. మ్యాచ్ సందర్భంగా చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ జట్టు సారథి శుభ్‌మాన్ గిల్ ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నారు. ఈ సమయంలో భారత మహిళల జట్టు ప్లేయర్ హర్లీన్ డియోల్ గిల్ ను కలిశారు. ఈ సందర్భంగా గిల్ ఆమెకు బ్యాటింగ్ లో చిట్కాలను వివరిస్తున్న వీడియోను గుజరాత్ టైటాన్స్ ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హర్లీన్ డియోల్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ 2024)లో గుజరాత్ జెయింట్స్ జట్టులో ఆడింది. ఆల్ రౌండర్ గా అద్భుత ప్రతిభను కనబర్చింది.

Also Read : IPL 2024 : ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా రోహిత్ శర్మ.. సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యాపై నెటిజన్ల ఆగ్రహం

ఐపీఎల్ 2024 సీజన్ లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు శుభ్‌మాన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సీజన్ లో గుజరాత్ మొత్తం 10 మ్యాచ్ లు ఆడగా.. కేవలం నాలుగు మ్యాచ్ లలోనే విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో ఎనిమిది పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇప్పటికే ఆ జట్టు ప్లే ఆఫ్ ఆశలను క్లిష్టతరం చేసుకుంది. ఇవాళ ఆర్సీబీపై జరిగే మ్యాచ్ లో గుజరాత్ జట్టు ఓడిపోతే ప్లే ఆఫ్ ఆశలు దాదాపు గల్లంతైనట్లే. దీంతో ఆర్సీబీపై విజయం సాధించి ప్లే ఆప్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని గిల్ సారథ్యంలోని గుజరాత్ జట్టు పట్టుదలతో ఉంది.

Also Read : IPL 2024 : కోల్‌కతాపై ముంబై జట్టు ఓటమికి అసలు కారణం అదేనా.. హార్దిక్ పాండ్యా ఏమన్నారంటే?