T20 World Cup 2024 : టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఆడే అమెరికా జట్టులో భారత్ ఆటగాళ్లు! వాళ్లెవరంటే!

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) జట్టును ప్రకటించింది. 15మంది సభ్యులతో కూడిన జట్టులో భారత్ మూలాలు కలిగిన ఆటగాళ్లు అనేక మంది ఉన్నారు.

USA T20 World Cup 2024 Squad : అమెరికా, వెస్టిండీస్ దేశాల వేదికగా జూన్ 1 నుంచి టీ20 ప్రపంచ కప్ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీకోసం ఇప్పటికే ఆయా దేశాలు తమతమ జట్లను ప్రకటించాయి. శుక్రవారం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) జట్టును ప్రకటించింది. 15మంది సభ్యులతో కూడిన జట్టులో భారత్ మూలాలు కలిగిన ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఆ జట్టుకు కెప్టెన్ కూడా గుజరాత్ లో జన్మించిన మోనాంక్ పటేల్ కావడం విశేషం. అతను అప్పట్లో గుజరాత్ అండర్ -19 జట్టుకు వికెట్ కీపర్ అండ్ బ్యాటర్. అదేవిధంగా.. మాజీ ఢిల్లీ బ్యాటర్, 2018 -19 రంజీ ట్రోపీలో అత్యధిక పరుగులు చేసిన మిలింద్ కుమార్ కూడా అమెరికా జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆ సీజన్ లో సిక్కిం తరపున మిలింద్ కుమార్ 1331 పరుగులు చేశాడు. 33ఏళ్ల మిలింద్ ఢిల్లీలో జన్మించాడు. దేశవాళీ క్రికెట్ లో ఢిల్లీ, త్రిపుర, సిక్కిం రాష్ట్రాల జట్ల తరపున ఆడిన అతను.. ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తో పాటు ఆర్సీబీకీ జట్టకు మిలింద్ ప్రాతినిధ్యం వహించాడు. మెరుగైన అవకాశాల కోసం అతను యూఎస్ కు వలస వెళ్లాడు. ప్రస్తుతం ఆ జట్టులో కీలక ప్లేయర్ గా ఉన్నాడు.

Also Read : IPL 2024 : ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా రోహిత్ శర్మ.. సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యాపై నెటిజన్ల ఆగ్రహం

ముంబై మాజీ లెఫ్టార్మ్ బౌలర్ హర్మీత్ సింగ్ కూడా యూఎస్ఏ జట్టులో చోటు దక్కించుకున్నాడు. 31ఏళ్ల హర్మీత్ సింగ్ ముంబైలో జన్మించాడు. 2012లో అండర్-19 ప్రపంచ కప్ లో భారత జట్టులో హర్మీత్ ఆడాడు. ముంబైలో జన్మించిన మరొక పేసర్ సౌరభ్ నేత్రవల్కర్. అతను 2010 అండర్ -19 ప్రపంచ కప్ లో భారత్ జట్టు ఆడాడు. కేఎల్ రాహుల్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ అగర్వాల్ వంటి ప్లేయర్స్ తో కలిసి ఆడాడు. ప్రస్తుతం యూఎస్ఏ జట్టులో సౌరభ్ కీలక బౌలర్. 2020లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులోకి తీసుకున్న పాకిస్థాన్ లో జన్మించిన పేసర్ అలీ ఖాన్ కూడా యూఎస్ఏ జట్టులో ఉన్నాడు. అయితే 2012 అండర్ -19 ప్రపంచ కప్ గెలిచిన జట్టుకు ఉన్ముక్త్ చంద్ర్ కెప్టెన్ గా వ్యవహరించాడు. స్మిత్ పటేల్ వికెట్ కీపర్ గా కొనసాగాడు. అయితే, యూఎస్ఏ జట్టులో చోటు దక్కించుకునేందుకు వీరిద్దరూ ప్రయత్నించినప్పటికీ వీరికి అవకాశం దక్కలేదు.

Also Read : IPL 2024 : చిన్నస్వామి స్టేడియంలో హర్లీన్ డియోల్‌కు బ్యాటింగ్ చిట్కాలు చెప్పిన శుభ్‌మాన్ గిల్.. వీడియో వైరల్

అమెరికా జట్టు : మోనాంక్ పటేల్ (కెప్టెన్), ఆరోన్ జోన్స్, ఆండ్రీస్ గౌస్, కోరె అండర్సన్, అలీ ఖాన్, హర్మీత్ సింగ్, జెస్సీ సింగ్, మిలింద్ కుమార్, నిసర్గ్ పటేల్, నితీశ్ కుమార్, కెంజిగె, సౌరభ్ నేత్రావల్కర్. షాడ్లీ, స్లీవెన్ టేలర్, షయాన్ జహంగీర్.

 

 

ట్రెండింగ్ వార్తలు