African Elephant Species : అంతరించిపోతున్న ఆఫ్రికన్ ఏనుగుల జాతులు..

ఆఫ్రికన్ ఏనుగుల జాతి అంతరించిపోతోంది. అంతరించిపోతున్న జంతు జాతుల జాబితాలోకి ఆఫ్రికన్ అడవి ఏనుగుల జాతి, సవన్నా ఏనుగుల జాతిని అధికారికంగా చేర్చినట్టు (IUCN) ప్రకటించింది.

African Elephant Species Endangered : ఆఫ్రికన్ ఏనుగుల జాతి అంతరించిపోతోంది. అంతరించిపోతున్న జంతు జాతుల జాబితాలోకి ఆఫ్రికన్ రెండు జాతులు చేరాయి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) రెడ్ లిస్టు జంతుజాతి జాబితాలో ఆఫ్రికన్ జాతి ఏనుగులను అధికారికంగా చేర్చారు. గత కొన్నేళ్లుగా ఈ రెండు ఆఫ్రికన్ ఏనుగుల జాతి హానికర స్థాయి నుంచి అంతరించిపోతున్న స్థితికి చేరుకున్నాయని ఆఫ్రికన్ ఫారెస్ట్ ఎలిఫెంట్ పేర్కొంది.

ఆఫ్రికన్ అడవి ఏనుగుల జాతి, సవన్నా ఏనుగుల జాతిని అంతరించిపోతున్న జంతుజాతుల జాబితాలో అధికారికంగా చేర్చినట్టు (IUCN) ప్రకటించింది. ఆఫ్రికా ఏనుగు జాతులు అక్కడి పర్యావరణ వ్యవస్థలతో పాటు ఆర్థిక వ్యవస్థలపై కీలక పాత్ర పోషిస్తున్నాయి. కానీ, కొన్నేళ్లుగా ఈ రెండు జాతులు క్రమంగా అంతరించిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో ఈ రెండు జాతుల ఏనుగులను ఏక జాతిగా గుర్తించారు. కానీ, ఇప్పుడు రెండు ఆఫ్రికన్ ఏనుగు జాతులను రెండు విభిన్న జాతులుగా గుర్తించింది.

కొన్ని జన్యువు ఆధారాలతో ఐయూసీఎన్ ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. ఫారెస్ట్, సవన్నా ఏనుగులు జన్యుపరంగా 5 లక్షల ఏళ్ల క్రితమే భిన్న జాతులుగా మారినట్టు ఆధారాలు ఉన్నాయి. సవన్నా జాతి ఏనుగులు ప్రపంచంలోనే అతిపెద్ద జాతి ఏనుగులుగా గుర్తించారు. అయితే అఫ్రికన్ అడవుల్లో కనిపించే ఈ రెండు ఏనుగు జాతులు చాలా చిన్నమొత్తంలో కనిపిస్తాయి.

వీటి ఆహారపు అలవాట్లు కూడా భిన్నంగా ఉంటాయి. అత్యంత అరుదుగా ఒకదానికొకటి ఎదురుపడతాయి. గత 31ఏళ్లలో ఆఫ్రికన్ అడవి ఏనుగుల జాతి 86శాతానికి క్షీణించింది. అలాగే గత 50ఏళ్లలో కనీసం 60శాతానికి సవన్నా ఏనుగుల జాతి క్షీణించినట్టు పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు