Russia-Ukraine War : యుక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి కేంద్రబిందువు.. గుత్తాధిపత్యానికి కారణమిదేనా..?

యుక్రెయిన్‌పై రష్యా దాడి యూరప్ దేశాలన్నీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఈ సమయంలో యుక్రెయిన్ ప్రజలకు ఆదుకునే ప్రపంచ దేశాల నుంచి కూడా పూర్తి స్థాయిలో మద్దతు కొరవడింది.

Russia-Ukraine War : యుక్రెయిన్‌పై రష్యా దాడి యూరప్ దేశాలన్నీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఈ క్లిష్ట సమయంలో యుక్రెయిన్ ప్రజలకు ఆదుకునే ప్రపంచ దేశాల నుంచి కూడా పూర్తి స్థాయిలో మద్దతు కొరవడింది. ప్రపంచాన్ని రష్యా లెక్క చేయకుండా యుక్రెయిన్‌పై దాడికి తెగబడటం వెనుక ధీమా ఏంటంటే.. అది యూరప్ నేచరుల్ గ్యాస్.. యూరప్ దేశాలకు అవసరమైన ఈ గ్యాస్ సరఫరాను 40శాతం వరకు రష్యానే తీరుస్తోంది. జర్మనీకి సరఫరా అయ్యు గ్యాస్ 65శాతం రష్యా నుంచే అవుతోంది. ఇతర చిన్న దేశాలు మాత్రం రష్యా అందించే గ్యాస్ పైనే పూర్తిగా ఆధారపడ్డాయి. యూరప్ దేశాల్లో ప్రధానంగా జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, పోలాండ్ దేశాలపై గ్యాస్ సరఫరాలో రష్యా తన ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగడం అనేది యూరప్‌ దేశాలకు ప్రాణ సంకటంగా మారింది. యుద్ధం కారణంగా రష్యా నుంచి సరఫరా ఆగిపోయి యూరప్‌ దేశాలు ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితి నెలకొంది.

యుక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో నార్డ్‌ స్ట్రీమ్‌ 2 పైప్‌లైన్‌ భవితవ్యం కూడా అనిశ్చితిలో పడింది. 1,100 కోట్ల డాలర్లతో చేపట్టిన ఈ 1,222 కిలోమీటర్ల గ్యాస్ పైప్ లైన్‌ నిర్మాణం.. రష్యా నుంచి బాల్టిక్‌ సముద్రం గుండా ఫిన్లాండ్, స్వీడన్, పోలాండ్‌ మీదుగా జర్మనీకి వెళ్తుంది. యుక్రెయిన్‌కు మద్దతిచ్చినందుకే 2021లో యూరప్‌ దేశాలకు అదనపు గ్యాస్‌ సరఫరాలను రష్యా నిలిపివేసింది. దాంతో అప్పుడు గ్యాస్‌ ధరలు ఏకంగా 8 రెట్లు పెరిగి ఆర్థికంగా భారీగా దెబ్బతిన్నాయి. ఈ భయంతోనే యుక్రెయిన్‌తో యుద్ధానికి దిగకుండా రష్యాను ఏదో రకంగా ఆపేందుకు యూరప్‌ దేశాలు, అందులో జర్మనీ, ఫ్రాన్స్‌ ఎన్నోవిధాలుగా ప్రయత్నించాయి.

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ అమెరికా, రష్యా చుట్టూ అనేకసార్లు తిరిగారు. బైడెన్, పుతిన్‌ చర్చలకు సిద్ధమయ్యారు. యుద్ధ నేపథ్యంలో అమెరికా నుంచి గ్యాస్‌ దిగుమతి చేసుకోవాలనుకుంటే.. ఆర్థికంగా పెను భారంగా మారుతుంది. అమెరికాపై ఆధారపడాల్సి వస్తే.. గ్యాస్ ధరలు మరో రెండింతలయ్యే అవకాశం ఉంది. అందుకే రష్యాను బుజ్జగించేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రష్యాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే.. రష్యా తమను ఇరుకున పెట్టే పరిస్థితి ఉందనే అమెరికా వెనకాడుతోంది. ప్రస్తుతం దేశీయ గ్యాస్ అవసరాలను తీర్చడానికే అమెరికా అనేక అవస్థలు పడుతోంది. యూరప్‌కు గ్యాస్‌ సరఫరా చేసే పరిస్థితి లేదని నిపుణులు చెబుతున్నమాట..

Russia Ukraine War Russian Gas Company Gazprom Sits At The Centre Of Ukraine Conflict

గాజ్‌ప్రోమ్.. రష్యా గుత్తాధిపత్యానికి కారణమిదే..
రష్యాలో గ్యాస్ ఉత్పత్తికి అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఇదే రష్యా ధీమా.. తమ నిర్ణయాలను ధిక్కరిస్తే గ్యాస్ సరఫరా విషయంలో ఆయా దేశాలను ఇబ్బందిపెట్టవచ్చులేనని ధీమాతో కనిపిస్తోంది. రష్యాలో ప్రధాన గ్యాస్ సరఫరాదారుగా GAZPROM ఫ్యాక్టర్ ఉంది. ఇక్కడి నుంచే గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. గాజ్‌ప్రోమ్ అనే కంపెనీ రష్యాకు గర్వకారణంగా నిలిచింది. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ఉత్పత్తిదారుగా రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని లఖ్తా సెంటర్‌లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉంది. ప్రభుత్వ యాజమాన్యంలో ఈ గ్యాస్ గాజ్ ప్రోమ్ కంపెనీ నడుస్తోంది.

2019 నాటికి, 120 బిలియన్ అమెరికా డాలర్లకుపైగా అమ్మకాలతో Gazprom ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్‌గా లిస్టెడ్ సహజ వాయువు కంపెనీగా పేరొందింది. గ్యాస్ ఉత్పత్తితో ఆదాయం ద్వారా రష్యాలో అతిపెద్ద కంపెనీగా నిలిచింది. 2020 ఫోర్బ్స్ గ్లోబల్ 2000లో గాజ్‌ప్రోమ్ ప్రపంచంలోని 32వ అతిపెద్ద పబ్లిక్ కంపెనీగా అవతరించింది. ప్రపంచ దేశాల హెచ్చరికలను సైతం లెక్కచేయకుండా యుక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడటంలో గాజ్‌ప్రోమ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ గాజ్‌ప్రోమ్ సాయంతోనే రష్యా ఉక్రెయిన్‌పై తమ దండయాత్రను ఖచ్చితమైన పద్ధతిలో ప్లాన్ చేసిందని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు, క్రూడ్ ఆయిల్ గ్యాస్ ధరలు 7 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. రష్యాను సైనికంగా, ఆర్థికంగా యుక్రెయిన్‌లో తమ చర్యలను కొనసాగించడానికి కారణం కూడా ఇదేననే వాదన వినిపిస్తోంది.

Russia Ukraine War Russian Gas Company Gazprom Sits At The Centre Of Ukraine Conflict

రష్యా దండయాత్రకు రెండు రోజుల ముందు.. రష్యాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో గాజ్‌ప్రోమ్ యాజమాన్యంలోని నార్డ్ స్ట్రీమ్ 2 (ns2) పైప్‌లైన్ సర్టిఫికేషన్‌ను నిలిపివేయాలని జర్మనీ నిర్ణయించింది. నోర్డ్ స్ట్రీమ్ 2 అనేది రష్యా నుంచి యూరప్ వరకు బాల్టిక్ సముద్రం మీదుగా నడుస్తున్న కొత్త ఎగుమతి గ్యాస్ పైప్‌లైన్ కలిగి ఉంది. నార్డ్ స్ట్రీమ్ అనేది ఐరోపాలోని ఆఫ్‌షోర్ సహజ వాయువు పైపులైన్ల వ్యవస్థ.. ఈ వ్యవస్థ మొత్తం రష్యా నుంచి జర్మనీ వరకు బాల్టిక్ సముద్రం కిందనే నడుస్తోంది. రష్యాపై నేరుగా ప్రభావితం చేసే గాజ్‌ప్రోమ్‌పై ఆంక్షలు విధించే అధికారం ఈయూ దేశాలు కలిగి ఉన్నాయా లేదా అనేది ఒక ప్రశ్న అయితే.. దేశాలు తమ అవసరాల కోసం గాజ్‌ప్రోమ్‌పై ఆధారపడటం కొనసాగిస్తాయా అనేది కీలకమైన ప్రశ్నగా మారింది.

ఈయూ దేశాలను పక్కన పెడితే.. Gazprom గ్యాస్ వినియోగదారుల్లో చైనా కూడా ఒకటి.. ఈయూ, రష్యా వెలుపల ఉన్న టెర్మినల్స్‌లో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తుందా లేదా బలమైన గాజ్‌ప్రోమ్‌తో పోరాడటానికి వేరే చోట నుంచి దిగుమతి చేసుకోవడం ప్రారంభిస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. 2010లో రష్యా నుంచి ఈయూ గ్యాస్ దిగుమతులు 26 శాతం మాత్రమే.. ప్రస్తుతం 43 శాతానికి చేరువైంది. రష్యా గ్యాస్‌పై యూరప్ ఆధారపడటం ఏడాదికి ఏడాదికి పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో రష్యాను కాదని ముందుకు సాగడం కష్టమేనని ఈయూ దేశాలు అభిప్రాయపడుతున్నాయి.

Read Also : Russia-Ukraine war : యుక్రెయిన్ పై యుద్ధం ఆపాలంటూ డిమాండ్ చేస్తూ రష్యాలో నిరసనలు..వందలాది ఆందోళనకారులను అరెస్ట్

ట్రెండింగ్ వార్తలు