Eat Sweets : తీపి పదార్ధాలను ఎక్కవ మోతాదులో తింటే చక్కర స్ధాయి పెరగటంతోపాటు అనేక ఆరోగ్య సమస్యలు!

అధిక చక్కెరలు శరీరంలో చేరితే కొవ్వు రూపంలోకి మారతాయి. దీంతో బరువు పెరుగుతారు. పరగడుపున ఖాళీ కడుపుతో తీపి పదార్థాలను అస్సలు తినకూడదు. ఇలా చేయడం వల్ల రోజంతా నీరసంగా ఉంటారు. ఏ పని మీద ఆసక్తి కలుగదు.

Eat Sweets : చాలా మంది తీపిని ఎక్కువగా ఇష్టపడతారు. తియ్యని పదార్ధాలను అధిక మోతాదులో తినడం వల్ల అనారోగ్యం పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుద్ధి చేసిన చక్కర శరీరానికి హానికలిగిస్తుంది. మనకు ఇష్టమైన స్వీట్ తిన్నప్పుడు మన శరీరంలో డోపమైన్ అనే ఎంజైమ్ విడుదల అవుతుంది. దీని కారణంగా స్వీటు పదార్ధాలను పదేపదే తినాలన్న కోరిక కలుగుతుంటుంది. శరీరంలో చక్కర స్థాయి పెరగడంతో అనేక ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. గుండె సమస్యలు, షుగర్ వ్యాధుల నుండి ముంపు పొంచి ఉంటుంది.

తీపితో తయారైన కేకులు, పేస్ట్రీలు, చాక్లెట్లు తింటే అవి దీర్ఘకాలంలో డిప్రెషన్‌లోకి నెట్టేస్తాయి. మొటిమలు, యాక్నె పెరగడానికి కారణం తీపి ఎక్కువగా తినడమే కారణమని అధ్యయనాల్లో తేలింది. , చర్మం సాగిపోయి ముడతలు పడుతున్నా ప్రధాన కారణం చక్కెరలే. ఇవి చర్మం సాగే గుణాన్ని కోల్పోయేలా చేస్తాయి. వాపులు తలెత్తడానికీ, దంతాల ఆరోగ్యం పాడవడానికీ, అజీర్తి సమస్యలకి కూడా ఎక్కువగా తీపి పదార్ధాలే కారణమని నిపుణులు చెబుతున్నారు.

అధిక చక్కెరలు శరీరంలో చేరితే కొవ్వు రూపంలోకి మారతాయి. దీంతో బరువు పెరుగుతారు. పరగడుపున ఖాళీ కడుపుతో తీపి పదార్థాలను అస్సలు తినకూడదు. ఇలా చేయడం వల్ల రోజంతా నీరసంగా ఉంటారు. ఏ పని మీద ఆసక్తి కలుగదు. ఒంట్లో చక్కెర స్థాయి కూడా పెరుగుతుంది. అన్నంలో కూడా చక్కెర ఉంటుంది. ఆ వెంటనే స్వీటు తినడం వల్ల రక్తంలో ఒకేసారి ఎక్కువ మొత్తంలో చక్కెర విడుదలవుతుంది. అధిక తీపిపదార్ధాలు తీనటం వల్ల కిడ్నీలు, గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

చక్కెర ఎక్కువ తినేవారు మానేయడం కష్టంగా అనిపిస్తే మెల్లమెల్లగా మానేయాలి. ఇలా చేయటంవల్ల శరీరంలో చక్కెర స్థాయి క్రమక్రమంగా తగ్గుతుంది. ఎక్కువగా తీపి తినకుండా ఉండడం వల్ల చర్మం కాంతివంతంగా అవుతుంది. అంతేకాదు బరువు తగ్గి ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. శరీరానికి చక్కెర కూడా అవసరమే. కానీ మోతాదుకు మించి తింటే అనర్థాలు తప్పవన్న విషయాన్ని గుర్తుంచుకోవటం మంచిది.

ట్రెండింగ్ వార్తలు