Blood Pressure Level : మీ బీపీని ఎప్పుడైనా చెక్ చేశారా? ఏ వయస్సు వారు ఎన్నిసార్లు బీపీని చెక్ చేసుకోవాలంటే?

Blood Pressure Level : ఇటీవలి అధ్యయనం ప్రకారం.. దాదాపు 30శాతం మంది భారతీయులు రక్తపోటును జీవితంలో ఒకసారి కూడా పరీక్షించుకోలేదని తేలింది. పెద్దలు బీపీని ఎన్నిసార్లు చెక్ చేయించుకోవాలంటే?

Blood Pressure Level : 18 ఏళ్ల నుంచి 40ఏళ్ల మధ్య ఉన్న పెద్దలు ఏదైనా అంతర్లీన వ్యాధులను గుర్తించడానికి ప్రతి 3ఏళ్లకు తమ రక్తపోటు స్థాయిలను చెక్ చేయాలని వైద్యులు సూచించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ రీసెర్చ్ (ICMR-NCDIR) ఇటీవలి అధ్యయనం ప్రకారం.. దాదాపు 30శాతం మంది భారతీయులు తమ రక్తపోటును ఎప్పుడూ పరీక్షించుకోలేదని తేలింది.

Read Also : Garlic Health Benefits : వెల్లుల్లి తింటే కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలివే.. మీ డైట్‌లో తప్పక చేర్చుకోండి!

ప్రతి ఐదేళ్లకు బీపీ చెక్ చేయాలి :
వాస్తవానికి, 40 ఏళ్లు పైబడిన వారు సంవత్సరానికి ఒకసారి వారి రక్తపోటును చెక్ చేయించుకోవాలి. 18ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్నవారు హై-రిస్క్ కేటగిరీలోకి రాకపోతే ప్రతి 3 నుంచి 5 ఏళ్లకు వారి రక్తపోటును చెక్ చేయాలని గురుగ్రామ్‌లోని సికె బిర్లా హాస్పిటల్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ విభాగం డాక్టర్ తుషార్ తాయల్, లీడ్ కన్సల్టెంట్ తెలిపారు. హైపర్‌టెన్సివ్ బాధితులందరూ కనీసం నెలకు ఒకసారి డిజిటల్ బీపీ మానిటర్‌తో రక్తపోటును పర్యవేక్షించాలి. 15 నిమిషాల విశ్రాంతి మధ్య చేయికి కఫ్‌ని టై చేసి తర్వాత చెక్ చేయాలని డాక్టర్ అజయ్ అగర్వాల్ తెలిపారు.

అలాంటి వారిలో బీపీ స్థాయి ఇలా ఉండాలి :
ప్రమాద కారకాలు లేని వారిలో రక్తపోటు తప్పనిసరిగా (140/90mm Hg) కన్నా తక్కువగా ఉంటుందని ఆయన వివరించారు. లేదంటే.. అవయవ నష్టం (కిడ్నీలు, గుండె లేదా కళ్ళలో) ప్రమాదాన్ని తగ్గించడానికి మధుమేహం లేదా మూత్రపిండాల వ్యాధి వంటి ప్రమాద కారకాలు ఉన్నవారిలో బీపీ స్థాయి 130/80 కన్నా తక్కువగా ఉండాలని డాక్టర్ అజయ్ చెప్పారు. 34శాతం మంది భారతీయులు ప్రీ-హైపెర్టెన్సివ్ దశలో ఉన్నారని కూడా అధ్యయనంలో తేలింది.

సాధారణ రక్తపోటు, రక్తపోటు మధ్య మధ్యస్థ స్థితికి హృదయ సంబంధ వ్యాధులకు గణనీయంగా కారణమైందని పరిశోధనలో తేలింది. బీపీని చెక్ చేయడం, నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం (మందులతో లేదా లేకుండా). ఎందుకంటే.. నిర్ధారణ చేయని హైపర్‌టెన్షన్ స్ట్రోక్, గుండెపోటు, మూత్రపిండాలు దెబ్బతినడం, కంటి దెబ్బతినడానికి ప్రమాద కారకమని డాక్టర్ తాయల్ హెచ్చరించారు.

Read Also : World Health Day : మీకు ప్రీ-డయాబెటిస్‌ ఉందని తెలుసా? కంట్రోల్ చేయకుండా వదిలేయవద్దు.. వైద్యుల హెచ్చరిక..!

ట్రెండింగ్ వార్తలు