4 రోజులుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ వద్ద చిరుత సంచారం.. బోన్ వరకు వచ్చి మళ్లీ వెళ్లిపోతూ..

దాన్ని బంధించేందుకు మొత్తం 5 బోన్లు, 25 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

హైదరాబాద్ శివారులోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ వద్ద చిరుత సంచరిస్తోంది. దాన్ని బంధించడం కోసం అటవీ అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. బోన్ వరకు వచ్చి మళ్లీ వెళ్లిపోతోంది చిరుత. దాన్ని బంధించేందుకు మొత్తం 5 బోన్లు, 25 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అన్ని ట్రాప్ కెమెరాల్లో చిరుత దృశ్యాలు చిక్కాయి.

మేకను ఎరగా వేసినప్పటికీ బోనులోకి రాకుండా చిరుత తప్పించుకు తిరుగుతోంది. ఒకే ప్రాంతంలో చిరుత సంచరిస్తోంది. చిరుత కోసం 4 రోజులుగా శ్రమిస్తున్నాయి ప్రత్యేక బృందాలు. చిరుత సంచారంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.

చిరుత ఫెన్సింగ్ దూకి ఎయిర్‌పోర్ట్‌ వద్దకు వచ్చినట్లు తెలిసింది. రన్‌వే పై కూడా కనపడినట్లు తెలుస్తోంది. ట్రాప్ కెమెరాల సంఖ్యను పెంచుతూ దాన్ని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు.

Also Read: పాఠశాలలకు బాంబు బెదిరింపుల కలకలం.. పోలీసుల తనిఖీలు

ట్రెండింగ్ వార్తలు