బెంగాల్ లో జులై 31 వరకు లాక్ డౌన్ పొడిగింపు..రైలు,మెట్రో సేవలు కూడా బంద్

కరోనా వైరస్  కేసులు పెరుగుతున్న నేపథ్యంలో  వెస్ట్ బెంగాల్ ప్రభత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుత లాక్ డౌన్(ఆన్  లాక్-1) దశ జూన్ 30 తో ముగియనున్న సమయంలో… జులై 31వరకు బెంగాల్ లో  లాక్ డౌన్ ను పొడిగిస్తూ మమతా సర్కార్ నిర్ణయం తీసుకుంది. 

జులై 31 వరకు పాఠశాలలు మరియు కళాశాలకళాశాలలు యధావిధిగా మూసివేయబడి ఉంటాయి. అంతేకాకుండా పొడిగించిన లాక్డౌన్ కాలంలో రైలు మరియు మెట్రో సేవలు కూడా ఉండవు

బెంగాల్‌లో ఇప్పటివరకు 14,728 కోవిడ్ -19 కేసులు 580 మరణాలు నమోదయ్యాయి.  రాష్ట్రంలో 9,218 యాక్టీవ్ కేసులు ఉన్నాయి

ట్రెండింగ్ వార్తలు