Flooded Car Video: వాన నీటికి రూ.80 లక్షల కారు డ్యామేజ్.. మండిపడ్డ కారు యజమాని

ఈ నీళ్లలో క్రేను కూడా ప్రవేశించే అవకాశం లేదని వాపోయారు. తమ కష్టాల గురించి అధికారులు..

పేరుకి మెట్రోసిటీ.. ఓ గంట వర్షం కురిస్తే చాలు రోడ్లన్నీ చెరువులను తలపిస్తాయి. దేశంలోని ఎన్నో మెట్రో నగరాల్లో ఇదే పరిస్థితి. ఢిల్లీ, బెంగళూరులో ఇటువంటి ఘటనలు చూశాం. ఇప్పుడు గురుగ్రాంలోనూ ఇదే పరిస్థితి. అక్కడి వీడియోలు వైరల్ అవుతున్నాయి.

పోష్ సెక్టార్ 57లో కురిసిన వర్షాల కారణంగా అత్యంత ఖరీదైన తమ కార్లు పాడయ్యాయంటూ ఓ వ్యక్తి ఈ వీడియోను పోస్ట్ చేశారు. వర్షపు నీటిలో తన రూ.83 లక్షల విలువైన బీఎండబ్ల్యూ ఎం340ఐ కారు మునిగిపోయిందని గజోధర్ సింగ్ పేరిట ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను ఒకరు పోస్ట్ చేశారు.

క్రేన్ ద్వారా తన కారుని పక్కను జరుపుదామని ఫోన్ చేశానని, అయితే, ఈ నీళ్లలో క్రేను కూడా ప్రవేశించే అవకాశం లేదని వాపోయారు. తమ కష్టాల గురించి అధికారులు పట్టించుకోవాలని అన్నారు. కారు కొనేటప్పుడు ట్యాక్సుల పేరిట ప్రభుత్వం వేలాది రూపాయలు తీసుకుంటుందని, కార్లు డ్యామేజీ కాకుండా సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదని కొందరు నెటిజన్లు పేర్కొన్నారు. ట్యాక్సులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ సరైన సౌకర్యాలు కల్పించడంలో ఉంటే బాగుంటుందని కొందరు విమర్శలు గుప్పించారు.

Also Read: షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో భారీ దోపిడీ.. 30లక్షల విలువైన బంగారం, ఇతర వస్తువులు అపహరణ

ట్రెండింగ్ వార్తలు