Robbery in Shirdi Train: షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో భారీ దోపిడీ.. 30లక్షల విలువైన బంగారం, ఇతర వస్తువులు అపహరణ

షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో గురువారం అర్థరాత్రి చోరీ జరిగింది. మూడు బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు.

Robbery in Shirdi Train:  షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో భారీ దోపిడీ.. 30లక్షల విలువైన బంగారం, ఇతర వస్తువులు అపహరణ

Robbery in Shirdi to Kakinada Train

Shirdi – Kakinada Express Robbery : షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో గురువారం అర్థరాత్రి భారీ దోపిడీ జరిగింది. మూడు బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ప్రయాణీకులు నిద్రమత్తులో ఉండగా లగేజీ దోచుకొని వెళ్లిపోయారు. మహారాష్ట్ర లాతూరు రోడ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 30 మంది ప్రయాణీకుల లకేజీని దుండగులు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇందులో భారీ ఎత్తున బంగారంతోపాటు ఇతర వస్తువులు ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.30లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది.

Also Read : Goods Train : బిట్రగుంట రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. నాలుగు రోజుల్లో రెండోసారి

అర్ధరాత్రి 2గంటల సమయంలో ఈ దోపీడి జరిగింది. దోపిడీ జరిగినట్లు గుర్తించిన ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, దోపిడీ అనంతరం దొంగలు బీదర్ కు ముందున్న వర్లీ స్టేషన్ లో దిగిపోయినట్లు ప్రయాణికులు గుర్తించారు. దీంతో బీదర్ లో రైలును నిలిపివేసి ప్రయాణికులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మూడు బోగీల్లోనూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రయాణికులే ఉన్నారు. ఈ ఘటనపై దక్షిణ మధ్య రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైలు సికింద్రాబాద్ చేరుకున్న తరువాత పలువురు ప్రయాణికులు దోపిడీ ఘటనపై రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖమ్మం రైల్వే స్టేషన్ పీఎస్ లో మరికొందరు ప్రయాణీకులు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

Also Read : చోరీ కోసం వచ్చిన దొంగకు నిరాశ.. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందని సీసీ కెమెరా ముందు ఏడుపు