Kishan Reddy : హైదరాబాద్‌కు మరో మణిహారం.. మార్చి 5న పౌర విమానయాన పరిశోధనా కేంద్రం ప్రారంభం : కిషన్ రెడ్డి

Kishan Reddy : ఈ ఏవియేషన్ రీసెర్చ్ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మార్చి 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ పౌర విమానయాన పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.

kishan reddy says civil aviation research organisation to be inagrureated by pm modi government

Kishan Reddy : తెలంగాణలోని హైదరాబాద్ మహానగరంలో మరో మణిహారం చేరనుంది. కేంద్ర ప్రతిష్టాత్మక సంస్థ అయిన కొత్త పౌర విమానయాన పరిశోధనా కేంద్రం అతి త్వరలో అందుబాటులోకి రానుంది. బేగంపేట విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ పౌర విమానయాన పరిశోధనా కేంద్రాన్ని (CARO) ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం.

ఈ ఏవియేషన్ రీసెర్చ్ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మార్చి 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ పౌర విమానయాన పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. తెలంగాణంలో ప్రధాని మోదీ మార్చి 4, 5వ తేదీల్లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. మోదీ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారైనట్టు తెలుస్తోంది.

Read Also : BJP Lok Sabha Candidates : 7 రాష్ట్రాలు, 120మంది అభ్యర్థులు.. తుది దశకు బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా!

మోదీ తన పర్యటనలో భాగంగా రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్‌ జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పత్రిక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణకు మోదీ ప్రభుత్వం అందించనున్న మరో వరమని ఆయన అన్నారు. భాగ్యనగరానికి మరో మణిహారమని కిషన్ రెడ్డి చెప్పారు.

దేశంలో మొట్టమొదటి గృహ-5 ప్రమాణాలతో కూడిన తొలి సెంటర్ ఇదేనన్నారు. అయితే, ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్‌లో విమానాశ్రయాలు, ఎయిర్ నావిగేషన్ సేవలకు సంబంధించిన పరిశోధనా సౌకర్యాలు , ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ కమ్యూనికేషన్స్ డొమైన్ సిమ్యులేటర్స్ అందుబాటులోకి రానున్నాయి.

* నెట్ వర్క్ ఎమ్యులేటర్
* విజువలైజేషన్ & అనాలసిస్ ల్యాబ్స్
* సర్వెలెన్స్ ల్యాబ్స్ నావిగేషన్ సిస్టమ్స్
* ఎమ్యులేషన్ & సిమ్యులేషన్ ల్యాబ్స్
* సైబర్ సెక్యూరిటీ & థ్రెట్ అనాలసిస్ ల్యాబ్స్
* డేటా మేనేజ్‍మెంట్ సెంటర్
* ప్రాజెక్ట్ సపోర్ట్ సెంటర్
* సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ & టూల్స్ సెంటర్
* నెట్ వర్క్ ఇన్‌ఫ్రా సెంటర్

మార్చి 4న ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభం.. :
మార్చి 4న ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్ ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించనున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా మోదీ ఈ పవర్ ప్లాంట్‌ను జాతికి అంకితం చేయనున్నట్టు తెలిపారు. ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా రూ. 6,000 కోట్లతో ఎన్టీపీసీ నిర్మించిన 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌ను ప్రధాని ప్రారంభించనున్నారు. గత అక్టోబర్‌లో నిజామాబాద్ పర్యటనలో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ను మోదీ ప్రారంభించారు. మొత్తంగా 1,600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన థర్మల్ పవర్ ప్లాంట్లు  అందుబాటులోకి రానున్నాయి.

తెలంగాణ ప్రజల గృహ, వాణిజ్య, వ్యవసాయ విద్యుత్ అవసరాలను థర్మల్ పవర్ ప్లాంట్లు తీర్చనున్నాయి. మార్చి 4వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో మొదటి విడత పవర్ ప్లాంట్లు అందుబాటులో కి రానున్నాయి. పేజ్ టూ లో భాగంగా 2,400 మెగావాట్ల(3*800 MW) సామర్థ్యం కలిగిన థర్మల్ పవర్ ప్లాంట్లను రామగుండంలో ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఎన్టీపీసీ నిర్ణయం తీసుకుందని కిషన్ రెడ్డి తెలిపారు. అయితే, మోదీ చొరవతో మొదటి విడత 1600 మెగావాట్ల విద్యుత్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. ఇప్పటికే 100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంటును 2022లో ఎన్టీపీసీని రామగుండంలో కేంద్రం ఏర్పాటుచేసింది.

Read Also : Kodali Nani Comments : జెండా సభలో పవన్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్!

ట్రెండింగ్ వార్తలు