Kodali Nani Comments : జెండా సభలో పవన్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్!
Kodali Nani Comments : జెండా సభలో సీఎం జగన్‌పై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాపు ఓట్ల కోసం కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
- Sreehari A
- Published On : February 29, 2024 / 09:11 PM IST
AP Former Minister Kodali Nani Slams Chandrababu Naidu and Pawan Kalyan
Kodali Nani Comments : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కామెంట్స్‌పై మాజీ మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. జెండా సభ పెట్టి ప్రజలకు ఏం చెప్పకుండా సీఎం జగన్‌ను తిట్టారని ఆయన విమర్శించారు.
ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబు రాసి ఇచ్చిన స్ర్కిప్ట్ చదువుతూ జగన్‌ను పవన్ తిట్టారంటూ కొడాలి నాని ఫైర్ అయ్యారు. తాడేపల్లిగూడెం జెండా సభలో పవన్ జగన్‌పై వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన కొడాలి నాని.. పవన్‌ను నమ్ముకుని కాపు ఓట్ల కోసం చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
Read Also : Kapu Leaders : కాపు నేతలు హర్ట్ అయ్యారా? పవన్ కల్యాణ్‌తో కటీఫేనా?
పవన్‌ను తాము తిడితే కాపు వర్గాన్ని తమవైపు తిప్పుకునేలా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు. కాపు సామాజిక వర్గ ప్రజలే చంద్రబాబుకు బుద్ధి చెబుతారని కొడాలి నాని కామెంట్ చేశారు. చంద్రబాబు, పవన్ చేతిలో మోసపోవడానికి ఎవరు సిద్ధంగా లేరన్నారు.
రాజకీయ పార్టీ పెట్టిన పవన్ చంద్రబాబుకు డబ్బా కొట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఓటు బ్యాంకు మొత్తం పవన్ సామాజిక వర్గానికి వెళ్లేలా చంద్రబాబు కుటిల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
Read Also : Pawan Kalyan : కాపులు ఎటువైపు? 24 సీట్లు తీసుకున్న పవన్ కల్యాణ్‌పై విమర్శలు ఎందుకు?
