Cheteshwar Pujara: “ఏదైనా ఐపీఎల్ జట్టు తీసుకుంటే ఒక్క మ్యాచ్ కూడా ఆడేవాడ్ని కాదు”

కౌంటీ చాంపియన్‌షిప్ తన రిథమ్ తిరిగొచ్చేలా చేసిందని అంటున్నాడు చతేశ్వర్ పూజారా. ఐపీఎల్‌ లో ఏ జట్టూ తనను కొనుగోలు చేయకపోవడమే కలిసొచ్చిందని కామెంట్ చేశాడు. సస్పెక్స్ లోని రెండు గేమ్ ల ఐదు డివిజన్లలో 720 పరుగులు చేసిన పూజారా 120 యావరేజ్ దక్కించుకున్నాడు.

 

 

Cheteshwar Pujara: కౌంటీ చాంపియన్‌షిప్ తన రిథమ్ తిరిగొచ్చేలా చేసిందని అంటున్నాడు చతేశ్వర్ పూజారా. ఐపీఎల్‌ లో ఏ జట్టూ తనను కొనుగోలు చేయకపోవడమే కలిసొచ్చిందని కామెంట్ చేశాడు. సస్పెక్స్ లోని రెండు గేమ్ ల ఐదు డివిజన్లలో 720 పరుగులు చేసిన పూజారా 120 యావరేజ్ దక్కించుకున్నాడు. శ్రీలంకతో తలపడిన టీమిండియాలో ఆడిన ఈ ప్లేయర్ ఇప్పుడు మరోసారి తన స్థానం కోసం తపన పడుతున్నాడు.

రెండేళ్లుగా రహానె తన పేలవ ప్రదర్శన చూపిస్తున్నప్పటికీ ఇంకా సెంట్రల్ కాంట్రాక్ట్ కు అవకాశం ఉందని బీసీసీఐ తెలియజేసింది. 2022 ఐపీఎల్‌ మెగా వేలంలో పూజారాను కొనుగోలు చేయకపోవడం కౌంటీ క్రికెటర్ ఆడాలని సూచించినట్లుగా మారిందని ఇది తనకు బాగా కలిసొచ్చిందని అంటున్నాడు పూజారా.

భారత జట్టుకు తిరిగి వచ్చిన తర్వాత, పుజారా IPL 2022 వేలంలో తనను ఎంపిక చేసినప్పటికీ తనకు ఆడేందుకు సమయం ఉండేది కాదని.. ఇప్పుడు కౌంటీ క్రికెట్ ఆడటం తన రిథమ్ తిరిగి అందించిందని చెప్తున్నాడు. భారత జట్టుకు తిరిగి రావడంపై పాజిటివ్ గా ఉన్నానని, కౌంటీ క్రికెట్ ఆడటం ప్రారంభించాక ఆత్మవిశ్వాసం పెరిగిందని వెల్లడించాడు.

Read Also: అరంగ్రేట మ్యాచ్‌లోనే పూజారా డబుల్ సెంచరీ

“ఇప్పుడు మీరు చెప్పగలరు. నన్ను ఐపీఎల్‌లో ఏదో ఒక టీమ్ ఎంపిక చేసి ఉంటే, స్టేడియంలో ఆడించే అవకాశాలు తక్కువగా ఉండేవి. నెట్స్‌కి వెళ్లి ప్రాక్టీస్ చేస్తూనే ఉండేవాడిని. నెట్స్‌లో మ్యాచ్ ప్రాక్టీస్.. ప్రాక్టీస్ ఎల్లప్పుడూ ఇదే చేస్తే కష్టంగా ఉంటుంది. కౌంటీకి పిలిచినప్పుడు, ఓకే చెప్పేశా.. దానికి ప్రధాన కారణం, నా పాత రిథమ్‌ను తిరిగి పొందాలనుకోవడం”అని పుజారా మీడియాతో అన్నారు.

“నేను పాజిటివ్‌గా ఉన్నా. ఎటువంటి సందేహం లేదు. నా కౌంటీ స్టింట్ సాగిన దానిని బట్టి భారత జట్టులోకి పునరాగమనం చేస్తానని ఆశాభావంతో ఉన్నా. కానీ కౌంటీ క్రికెట్ ఆడటానికి వెళ్ళినప్పుడు, టీమిండియాలోకి రీఎంట్రీపై నా మనస్సులో ఎప్పుడూ లేదు; నా రిథమ్ తిరిగి కనుగొనడంలో ఒక పెద్ద ఇన్నింగ్స్ సహాయపడుతుందని తెలుసు” అని పేర్కొన్నాడు.

ట్రెండింగ్ వార్తలు