KKR vs PBKS : శ్రేయ‌స్ అయ్య‌ర్ ఔట్ కాగానే షారుఖ్ ఖాన్ చిన్న కొడుకు అబ్రామ్ ఖాన్ ఏం చేశాడో చూడండి

ఐపీఎల్ 17 సీజ‌న్‌లో మ్యాచులు అంచ‌నాల‌కు అంద‌కుండా సాగుతున్నాయి.

KKR vs PBKS – AbRam Khan : ఐపీఎల్ 17 సీజ‌న్‌లో మ్యాచులు అంచ‌నాల‌కు అంద‌కుండా సాగుతున్నాయి. భారీ స్కోరు చేసిన‌ప్ప‌టికీ వాటి కాపాడుకోవ‌డంలో జ‌ట్లు విఫ‌ల‌మ‌వుతున్నాయి. శుక్ర‌వారం ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్, పంజాబ్ కింగ్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో కోల్‌క‌తా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెన‌ర్లు సునీల్ న‌రైన్ (71; 32 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స‌ర్లు), ఫిల్ సాల్ట్ (75; 37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) రాణించ‌డంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు కోల్పోయి 261 ప‌రుగులు చేసింది.

ఈ మ్యాచ్ చూసేందుకు కేకేఆర్ స‌హ యజమాని షారుక్ ఖాన్, అతని కుమారుడు అబ్రామ్, మేనేజర్ పూజా దద్లానీ వ‌చ్చారు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ కూడా రాణించాడు. 10 బంతుల్లో 28 ప‌రుగులు చేసి అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. కాగా.. కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ ఔటైన సంద‌ర్భంగా అబ్రామ్ ఖాన్ ఇచ్చిన రియాక్ష‌న్స్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Ravichandran Ashwin : ప్లీజ్.. ఎవ‌రైనా మ‌మ్మ‌ల్ని కాపాడండి : అశ్విన్

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. కేకేఆర్ నిర్దేశించిన 262 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 18.4 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో జానీ బెయిర్ స్టో (108; 48 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్స‌ర్లు) విధ్వంస‌కర శ‌తకం బాద‌గా.. ప్రభసిమ్రాన్ సింగ్ (54; 20 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.

Sam Curran : టీ20ల్లో రికార్డు ఛేద‌న‌.. పంజాబ్ కెప్టెన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

ట్రెండింగ్ వార్తలు