CM Revanth Reddy : మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో.. పూర్తి షెడ్యూల్ ఇలా..
మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గోనున్నారు. ఎల్బీ నగర్, మల్కాజిగిరిలో రోడ్ షోలు నిర్వహిస్తారు.
- Harishth Thanniru
- Updated on- April 28, 2024 / 11:01 AM IST
CM Revanth Reddy
CM Revanth Reddy Election Campaign : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక నియోజకవర్గాల్లో విజయం సాధించేలా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నారు. ప్రతీరోజూ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ.. రోడ్ షోలు, సభల్లో పాల్గొంటూ ప్రజలనుద్దేశించి రేవంత్ ప్రసంగిస్తున్నారు. ఈ క్రమంలో పూర్తిస్థాయిలో బీజేపీపైనే ఫోకస్ పెట్టారు. రిజర్వేషన్ల అంశాన్ని ప్రధాన ప్రచార అస్త్రంగా ఎంచుకున్న కాంగ్రెస్ నేతలు.. బీజేపీ వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తుందంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
Also Read : CM Jagan : సీఎం జగన్ మలివిడత ఎన్నికల ప్రచారం.. తొలిరోజు మూడు నియోజకవర్గాల్లో సభలు.. షెడ్యూల్ ఇలా..
ఇవాళ (ఆదివారం) మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గోనున్నారు. ఎల్బీ నగర్, మల్కాజిగిరిలో రోడ్ షోలు నిర్వహిస్తారు. సాయంత్రం 5గంటలకు ఎల్బీ నగర్ రోడ్ షోలో పాల్గోనున్న సీఎం రేవంత్ రెడ్డి.. 6గంటల సమయంలో కార్నర్ మీటింగ్ లో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం రాత్రి 7గంటలకు మల్కాజిగిరిలో రేవంత్ రోడ్ షో కొనసాగుతుంది. రాత్రి 7.30 గంటలకు కార్నర్ మీటింగ్ లో రేవంత్ పాల్గొని ప్రసంగించనున్నారు.
