CM Jagan : సీఎం జగన్ మలివిడత ఎన్నికల ప్రచారం.. తొలిరోజు మూడు నియోజకవర్గాల్లో సభలు.. షెడ్యూల్ ఇలా..

అనంతపురం జిల్లా తాడిపత్రిలోని వైఎస్ఆర్ సర్కిల్ లో ఆదివారం ఉదయం 10గంటలకు నిర్వహించే బహిరంగ సభతో ఈ ప్రచార భేరిని జగన్ మోహన్ రెడ్డి మోగించనున్నారు.

CM Jagan : సీఎం జగన్ మలివిడత ఎన్నికల ప్రచారం.. తొలిరోజు మూడు నియోజకవర్గాల్లో సభలు.. షెడ్యూల్ ఇలా..

CM Jagan

CM Jagan Election Campaign : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో ఎన్నికల ప్రచార యాత్రకు సిద్ధమయ్యారు. ఇవాళ్టి నుంచి మలివిడత ఎన్నికల ప్రచారంకు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రంలో 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 పార్లమెంట్ స్థానాల్లో విజయమే లక్ష్యంగా జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు. రోజుకు మూడు సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో పర్యటించేలా రోడ్ మ్యాప్ కు వైసీపీ ముఖ్య నేతలు తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. తొలిరోజు (ఆదివారం) అనంతపురం జిల్లా తాడిపత్రిలోని వైఎస్ఆర్ సర్కిల్ లో ఉదయం 11గంటలకు నిర్వహించే బహిరంగ సభతో జగన్ మలివిడత ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుంది. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని వెంకటగిరిలోని త్రిభువని సర్కిల్ లో నిర్వహించే బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు లోక్ సభ స్థానం పరిధిలోని కందుకూరు కేఎంసీ సర్కిల్ లో జరిగే సభలోనూ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.

Also Read : Velampalli Srinivasa Rao : బోండా ఉమపై మూడు ఫిర్యాదులు చేశాం: వెలంపల్లి శ్రీనివాసరావు

  • తొలిరోజు జగన్ పర్యటన సాగేదిలా..
    ఉదయం 8.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గం గుండా 8.50 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
    ఉదయం 9గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి విమానంలో బయలుదేరి 9.45 గంటలకు కర్నూల్ లోని ఓర్వకల్లు విమానాశ్రయానికి జగన్ చేరుకుంటారు.
    10 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 10.30 గంటలకు తాడిపత్రిలోని హెలిప్యాడ్ స్థలికి చేరుకుంటారు.
    10.40 గంటలకు హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గం గుండా బయలుదేరి 10.50 గంటలకు బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు.
    11 గంటల నుంచి 11.45 గంటల వరకు తాడేపల్లిలోని వైఎస్ఆర్ సర్కిల్ లో జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు.
    బహిరంగ సభ అనంతరం 11.50 గంటలకు బయలుదేరి రోడ్డు మార్గం గుండా మధ్యాహ్నం 12గంటలకు హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు.
    మధ్యాహ్నం 12.10 గంటలకు హెలికాప్టర్ లో బయలుదేరి 1.10 గంటలకు తిరుపతి జిల్లాలోని వెంకటగిరికి సీఎం జగన్ చేరుకుంటారు.
    వెంకటగిరి పట్టణంలోని విశ్వోదయ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ లో దిగి.. అక్కడ నుంచి రోడ్డుమార్గం ద్వారా త్రిభువని సెంటర్ వద్దకు చేరుకుంటారు. అక్కడ నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభలో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు.
    మధ్యాహ్నం 2.40 గంటలకు హెలిప్యాడ్ వద్దకు చేరుకొని నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగే సభకు జగన్ బయలుదేరి వెళ్తారు.
    మధ్యాహ్నం 3గంటలకు కందుకూరు కేఎంసీ సర్కిల్ వద్ద జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు.

Also Read : Padi Kaushik Reddy : రేవంత్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు సాయం అడిగారు- కోమటిరెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

సోమవారం షెడ్యూల్ ఇలా..
సీఎం జగన్ మోహన్ రెడ్డి 29 (సోమవారం) అనకాపల్లి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఈ మేరకు శనివారం షెడ్యూల్ విడుదల చేశారు. 29వ తేదీ ఉదయం 10గంటలకు అనకాపల్లి జిల్లా చోడవరంలో నిర్వహించే బహిరంగ సభలో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. అదేరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరంలో జరిగే సభలో పాల్గొని మాట్లాడతారు. సాయంత్రం 3గంటలకు గుంటూరు జిల్లా పొన్నూరు సభల్లో సీఎం జగన్ పాల్గొని ప్రసంగిస్తారు.