Yuvraj Singh : ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టగల బ్యాటర్ ఎవరు..? రోహిత్, సూర్య కాదు.. షాకింగ్ సమాధానం చెప్పిన యువీ
ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది.
- Thota Vamshi Kumar
- Published On : April 27, 2024 / 12:22 PM IST
Yuvraj Singh
Yuvraj Singh : ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఐసీసీ యువరాజ్ సింగ్‌ను నియమించింది. ఈ క్రమంలో ఐసీసీ ఇంటరాక్షన్ సందర్భంగా రాబోయే టీ20 ప్రపంచకప్‌లో ఒక ఓవర్‌లో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టగల సత్తా ఏ బ్యాటర్‌లో ఉందని మీరు భావిస్తున్నారంటూ యువీకి ఓ ప్రశ్న ఎదురైంది. ఇందుకు యువరాజ్ సింగ్ చెప్పిన సమాధానం ప్రస్తుతం వైరల్‌గా మారింది.
టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌లను కాదని ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య పేరును చెప్పాడు. వన్డే ప్రపంచకప్ 2023లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో గాయపడిన పాండ్య కోలుకుని ఐపీఎల్ 2024తో రీ ఎంట్రీ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్‌కు సారథ్యం వహిస్తున్న అతడు బ్యాట్, బంతితో రాణించలేక పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న పాండ్య పేరును యువీ చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
KKR vs PBKS : శ్రేయస్ అయ్యర్ ఔట్ కాగానే షారుఖ్ ఖాన్ చిన్న కొడుకు అబ్రామ్ ఖాన్ ఏం చేశాడో చూడండి
ఇక టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ నుంచి మెరుపులు ఆశిస్తున్నట్లు అయితే.. హార్దిక్ పాండ్యతో శివమ్ దూబె ఇద్దరిని జట్టులో ఎంపిక చేయాలన్నాడు యువరాజ్. ‘ఐపీఎల్‌లో దూబె అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడు గేమ్ ఛేంజర్ అని నా అభిప్రాయం. అతడిని భారత జట్టులో చూడాలని అనుకుంటున్నాను.’ అని యువీ అన్నాడు.
కాగా.. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన సంగతిని అభిమానులు అంత త్వరగా మరిచిపోలేరు.
Ravichandran Ashwin : ప్లీజ్.. ఎవరైనా మమ్మల్ని కాపాడండి : అశ్విన్
టీ20 ప్రపంచకప్ 2024 జూన్ 2 నుంచి ఆరంభం కానుంది. వెస్టిండీస్, అమెరికాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. టీమ్ ఇండియా తన తొలి మ్యాచ్‌ను జూన్ 5న న్యూయార్క్‌లో ఆడనుంది. ఇక క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదరుచూస్తున్న భారత్, పాకిస్తాన్ జట్ల మ్యాచ్ జూన్ 9న జరగనుంది.
