Rishabh Pant
DC vs MI : ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా శనివారం మధ్యాహ్నం ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు భారీ స్కోర్ చేసింది. నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 257 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై జట్టు మొదట్లో వికెట్లు కోల్పోయింది. తరువాత బ్యాటర్లు కుదురుకొని పరుగులు రాబట్టారు. కానీ, ఆఖర్లో కాస్తతబడి 10 పరుగుల తేడాతో ముంబై జట్టు ఓటమి చవిచూసింది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరింది. దీంతో తమ ప్లే ఆఫ్ ఆశలను ఢిల్లీ జట్టు సజీవంగా నిలుపుకుంది.
Also Read : IPL 2024 : రాజస్థాన్ పై ఓటమి తరువాత లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు
ఈ మ్యాచ్ లో ఢిల్లీ బ్యాటర్లు జేక్ ఫ్రెజర్ 27 బంతుల్లో 84 పరుగులు చేయగా.. స్టబ్స్ 25 బంతుల్లో 48 పరుగులు చేశాడు. పంత్ 29 పరుగులు చేశాడు. అయితే, ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు విజయం సాధించినప్పటికీ ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ కు బిగ్ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి. పంత్ పై ఒక మ్యాచ్ నిషేధం విధించేందుకు ఐపీఎల్ మేనేజ్ మెంట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాఛ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు నిర్ణీత సమయంలో కోటా ఓవర్లు పూర్తిచేయలేదు. దీంతో స్లో ఓవర్ రేట్ కారణంగా పంత్ పై చర్యలకు ఐపీఎల్ మేనేజ్ మెంట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Also Read : IPL 2024 : మైదానంలో గాలిపటం ఎగరేసిన రిషబ్ పంత్.. పక్కకు నెట్టేసిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్
ఐపీల్ 2024 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు స్లో ఓవర్ రేట్ తో బౌలింగ్ చేయడం ఇది మూడోసారి. ఐపీఎల్ నియమావళి ప్రకారం.. వరుసగా మూడోసారి స్లో ఓవర్ రేట్ తో బౌలింగ్ చేస్తే ఆ జట్టు కెప్టెన్ పై 100శాతం మ్యాచ్ ఫీజును జరిమానా విధించడంతో పాటు మ్యాచ్ రిఫరీ విచక్షణ మేరకు ఒక మ్యాచ్ నిషేధం విధించే అవకాశం ఉంటుంది. ఐపీఎల్ మేనేజ్ మెంట్ కఠిన నిర్ణయం తీసుకుంటే పంత్ వచ్చే మ్యాచ్ కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.
THE HELICOPTER FROM RISHABH PANT. ?pic.twitter.com/upGfm36zJP
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 27, 2024