IPL 2024 : రాజస్థాన్ పై ఓటమి తరువాత లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

ఐపీఎల్ 2024 సీజన్ లో లక్నో జట్టు ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్ లలో ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఆ జట్టు తదుపరి మ్యాచ్ ను మంగళవారం ముంబై ఇండియన్స్ తో ఆడనుంది.

IPL 2024 : రాజస్థాన్ పై ఓటమి తరువాత లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

KL Rahul

LSG vs RR : ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా శనివారం రాత్రి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. లక్నో సొంత మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. చివరకు రాజస్థాన్ రాయల్స్ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఆ జట్టు ఆడిన తొమ్మిది మ్యాచ్ లలో ఎనిమిది విజయాలతో పాయింట్ల పట్టికలో 16 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ జట్టు ప్లే ఆఫ్ బెర్త్ దాదాపు ఖాయమైనట్లే.

Also Read : IPL 2024 : మైదానంలో గాలిపటం ఎగరేసిన రిషబ్ పంత్.. పక్కకు నెట్టేసిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్

మ్యాచ్ అనంతరం లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. మేము మరో 20 పరుగులు చేసిఉంటే బాగుండేది. మాకు సరియైన శుభారంభం లభించలేదు. కానీ, నాకు, దీపక్ హుడాకు మధ్య మంచి భాగస్వామ్యం కుదిరింది. ఎక్కువ సిక్స్ లు కొట్టే జట్టు గెలుస్తుందని నేను స్పష్టంగా అనుకుంటున్నాను. అయితే, మేము సిక్సర్లు కొట్టడానికి ప్రయత్నించాం. కానీ, ఈరోజు మొదటి రెండు ప్రారంభ వికెట్లు పడిపోయిన తరువాత మా విధానాన్ని మార్చుకోవాల్సి వచ్చిందని రాహుల్ అన్నాడు. ప్రత్యర్థి బ్యాటర్లు భారీ బౌండరీలతో మా బౌలర్లపై ఒత్తిడి పెంచారు. కృనాల్ బాగా బౌలింగ్ చేశాడు. కానీ, వారు ఫాస్ట్ బౌలర్లపై ఎదురుదాడి చేశారని రాహుల్ అన్నాడు.

Also Read : IPL 2024 : రెచ్చిపోయిన శాంసన్, ధ్రువ్.. లక్నోపై రాజస్థాన్ విజయం.. ప్లేఆఫ్స్‌కు అర్హత!

ఐపీఎల్ 2024 సీజన్ లో లక్నో జట్టు ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్ లలో ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఆ జట్టు తదుపరి మ్యాచ్ ను మంగళవారం ముంబై ఇండియన్స్ తో ఆడనుంది.