IPL 2024 : మైదానంలో గాలిపటం ఎగరేసిన రిషబ్ పంత్.. పక్కకు నెట్టేసిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్

ఢిల్లీ వర్సెస్ ముంబై మ్యాచ్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మైదానంలోకి గాలి పటం వచ్చింది.

IPL 2024 : మైదానంలో గాలిపటం ఎగరేసిన రిషబ్ పంత్.. పక్కకు నెట్టేసిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్

Rishabh Pant

DC vs MI : ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా శనివారం మధ్యాహ్నం ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు భారీ స్కోర్ చేసింది. నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 257 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై జట్టు మొదట్లో వికెట్లు కోల్పోయింది. తరువాత బ్యాటర్లు కుదురుకొని పరుగులు రాబట్టారు. కానీ, ఆఖర్లో కాస్త తబడి 10 పరుగుల స్వల్ప తేడాతో ముంబై జట్టు ఓటమి చవిచూసింది.

Also Read : IPL 2024 : రెచ్చిపోయిన శాంసన్, ధ్రువ్.. లక్నోపై రాజస్థాన్ విజయం.. ప్లేఆఫ్స్‌కు అర్హత!

ఢిల్లీ వర్సెస్ ముంబై మ్యాచ్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మైదానంలోకి గాలి పటం వచ్చింది. దీంతో రోహిత్ శర్మ ఆ గాలిపటాన్ని వికెట్ కీపింగ్ చేస్తున్న రిషబ్ పంత్ కు ఇచ్చాడు. పంత్ ఆ గాలిపటాన్ని మైదానంలో ఎగురవేసే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో సెక్యూరిటీ సిబ్బంది పంత్ వద్దకు వచ్చి గాలిపటాన్ని తీసుకొని వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మైదానంలో గాలిపటం ఎగురవేసినందుకు పంత్ కు ఫైన్ వేయాలంటూ సరదా కామెంట్లు చేశారు. అంతకుముందు రోహిత్ పరుగెత్తుకుంటూ క్రీజులోకి వచ్చే సమయంలో బాల్ అందుకుంటూ పంత్ అడ్డురావడంతో రోహిత్ పంత్ ను పక్కకు తోసేశాడు.. ఇందుకు సంబంధించిన ఫన్నీ వీడియోసైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రోహిత్, పంత్ మధ్య స్నేహసంబంధాన్ని గొప్పగా వివరిస్తూ కామెంట్లు చేశారు.

Also Read : IPL 2024: ముంబైపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయ దుందుభి

ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అత్యధిక స్కోరు సాధించింది. తద్వారా ఆ జట్టు వారి 13ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. 2011లో పంజాబ్ కింగ్స్ పై ఢిల్లీ జట్టు 231 పరుగులు చేసింది. ఐపీఎల్ లో ఢిల్లీకి ఇప్పటి వరకు అదే వ్యక్తిగతంగా అత్యధిక స్కోరు. 2024 సీజన్ లో భాగంగా శనివారం ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ గత రికార్డును బ్రేక్ చేసి.. 20 ఓవర్లలో 257 పరుగులు చేసింది. జాక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ తుఫాను ఇన్నింగ్స్ ఆడటంతో ఢిల్లీ జట్టు ఆ ఫీట్ ను సాధించించింది.