IPL 2024: ముంబైపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయ దుందుభి

లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ జట్టు పోరాడి ఓడింది.

IPL 2024: ముంబైపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయ దుందుభి

@DelhiCapitals

DC vs MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 43వ మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ 10 పరుగుల తేడాతో విజయ దుందుభి మోగించింది. 258 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు పోరాడి ఓడారు.

ఇషాన్ కిషన్ 20, రోహిత్ శర్మ 8, సూర్యకుమార్య యాదవ్ 26, తిలక్ వర్మ 63, హార్దిక్ పాండ్యా 46, నెహాల్ 4, టిమ్ డేవిడ్ 37, నబీ 0, పీయూష్ చావ్లా 10, లుక్ వుడ్ 9 పరుగులు చేశారు. దీంతో ముంబై స్కోరు 20 ఓవర్లకు 247-9గా నమోదైంది. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ 3, రషీఖ్ 3, ఖలీల్ 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. 

ఢిల్లీ బ్యాటింగ్ ఇలా..
గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన గత మ్యాచ్‌లో ఇరగదీసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈరోజు మ్యాచ్‌లోనూ దుమ్మురేపింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో అదరగొట్టింది. ఢిల్లీ బ్యాటర్లు చెలరేగడంతో ముంబై టీమ్‌కు 258 పరుగుల భారీ టార్గెట్ పెట్టింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 257 పరుగులు చేసింది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ మొదటి 17 బంతుల్లోనే 50 పరుగులు స్కోరు సాధించింది. ఓపెనర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ మరోసారి రెచ్చిపోయాడు. స్కోరు బోర్డుపై నమోదైన మొదటి 50 పరుగుల్లో 42 రన్స్ అతడివే కావడం విశేషం. దీన్నిబట్టే అర్థమవుతోంది అతడు ఎంతలా చెలరేగాడో. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేశాడు. మెక్‌గుర్క్ ధాటికి పవర్ ప్లేలో ఢిల్లీ 92 పరుగుల స్కోరు సాధించింది. 6.4 ఓవర్లలోనే డీసీ స్కోరు 100 పరుగులు దాటేసింది.

అతడి జోరుకు పియూష్ చావ్లా ఎట్టకేలకు అడ్డుకట్ట వేశాడు. జట్టు స్కోరు 114 పరుగుల వద్ద తొలి వికెట్‌గా అవుటయ్యాడు. 27 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 84 పరుగులు చేశాడు. 127 పరుగుల వద్ద మరో ఓపెనర్ అభిషేక్ పోరెల్(36) అవుట్ కావడంతో ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. షాయ్ హోప్ కూడా ధాటిగా ఆడడంతో ఢిల్లీ స్కోరు పరుగులు పెట్టింది. 17 బంతుల్లో 5 సిక్సర్లతో 41 పరుగులు చేసి మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. 16.1 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 200 పరుగులు దాటింది.

Also Read: ఆరు బంతుల్లో ఆరు సిక్స‌ర్లు కొట్ట‌గ‌ల బ్యాట‌ర్ ఎవ‌రు..? రోహిత్, సూర్య కాదు.. షాకింగ్ స‌మాధానం చెప్పిన యువీ

రిషబ్ పంత్ 19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 29 పరుగులు చేసి అవుటయ్యాడు. చివరల్లో ట్రిస్టన్ స్టబ్స్ బాదడంతో ఢిల్లీ స్కోరు 250 పరుగులు దాటింది. 25 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అతడికి తోడుగా అక్షర్ పటేల్ (11, 6 బంతుల్లో సిక్సర్) అజేయంగా ఉన్నాడు. ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా, ల్యూక్ వుడ్, బూమ్రా, నబీ తలో వికెట్ తీశారు.

Also Read: హైదరాబాద్‌కి మహేష్ బాబు ప్రేమ చూపిస్తున్న పంజాబ్ కింగ్స్.. వైరల్ అవుతున్న ట్వీట్..