Ravichandran Ashwin pleads for help after Punjab world record chase of 262
Ashwin : గతంలో ఎన్నడూ లేని విధంగా ఐపీఎల్ 17 సీజన్‌లో పరుగుల వరద పారుతోంది. బంతి పడిందే ఆలస్యం బ్యాటర్లు దాన్ని సిక్స్ లేదంటే ఫోర్‌గా మలుస్తున్నారు. సింగిల్స్ అన్నదే మరిచిపోయారు. ఫీల్డర్లు చేసేది లేక చూస్తూ ఉండిపోతుండగా.. బ్యాటర్ల విధ్వంసానికి బౌలర్లు బలి అవుతున్నారు. అయ్యో పాపం బౌలర్లు అంటూ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు జాలి చూపించడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు.
ఈ సీజన్లలో బ్యాటర్ల హవా ఎంతలా నడుస్తుంది అంటే గత 11 ఏళ్లుగా పదిలంగా ఉన్న ఐపీఎల్ రికార్డును ఈ సారి ఒక్క సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టే మూడు సార్లు బద్దలు కొట్టింది. కోల్‌కతా నైట్ రైడర్స్ 261 పరుగుల కొడితే.. దాన్ని పంజాబ్ కింగ్స్ అలవోకగా ఛేదించింది. 287 పరుగుల లక్ష్య ఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సైతం 260 పరుగులు చేసింది.
Sam Curran : టీ20ల్లో రికార్డు ఛేదన.. పంజాబ్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఇక రెండు వందల పరుగులను అనేది చాలా కామన్ గా మారిపోయింది. ఒకప్పుడు సిక్స్‌లు ఫోర్లు కొడుతుంటే ఎంజాయ్ చేసిన అభిమానులకు ప్రస్తుతం మ్యాచ్‌లు ఓ రకంగా బోర్ కొట్టిస్తున్నాయనే చెప్పవచ్చు. ఎప్పుడైనా బ్యాట్‌కు బాల్‌కు మధ్య సరైన పోరు ఉంటేనే మ్యాచ్‌లు ఆసక్తికరంగా ఉంటాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
శుక్రవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రికార్డు స్థాయిలో 523 పరుగులు నమోదు అయ్యాయి. ఈ మ్యాచ్‌లో నమోదైన స్కోర్లపై టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ వ్యంగ్యంగా స్పందించాడు. ఎవరైనా మా బౌలర్లను కాపాడాలంటూ ట్వీట్ చేశాడు. ఆ దేవుడే కాపాడాలి అన్నట్లుగా దేవుడికి దండం పెడుతున్న ఎమోజీని మరో భారత స్పిన్నర్ చాహర్ షేర్ చేశాడు.
Jasprit Bumrah : ముంబై ఓపెనర్‌గా జస్‌ప్రీత్ బుమ్రా..?
బౌండరీల దూరం పెంచాలి..
ఐపీఎల్‌లో భారీ స్కోరు నమోదు అవుతుండడం, బౌలర్లు ప్రేక్షకపాత్రకే పరిమితం కావడం పట్ల భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం రూల్స్ బ్యాటర్లకు అనుకూలంగా ఉన్నాయన్నాడు. కనీసం బౌండరీల దూరం పెంచితే అప్పుడు బౌలర్లకు కాస్త అనుకూలంగా ఉంటుందని, బ్యాట్, బాల్ మధ్య సమరాన్ని ఆస్వాదించవచ్చునని ఇప్పటికే చెప్పాడు.
— Yuzvendra Chahal (@yuzi_chahal) April 26, 2024