Chinna Jeeyar Swamy : ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టక ముందు దేశం అస్తవ్యస్తంగా ఉంది.. ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటున్నారు

ఎవరి మతాలు వారు అనుసరించాలి. దానితోపాటు ఇతరులను కూడా గౌరవించాలని చిన్న జీయర్ స్వామీజీ సూచించారు.

Chinna Jeeyar Swamy – RSS Chief Mohan Bhagwat : ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టక ముందు దేశం అస్తవ్యస్తంగా ఉందని, ఇప్పుడు భారతదేశం నుంచి వచ్చామని గర్వంగా చెప్పుకుంటున్నారని శ్రీశ్రీశ్రీ త్రిదండి స్వామి చిన్నజీయర్ స్వామి అన్నారు. రంగారెడ్డి జిల్లా నాధల్‌గుల్‌లో విద్యాభారతి విజ్ఞాన కేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో త్రిదండి చిన్నజీయర్ స్వామి, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొని పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామి మాట్లాడుతూ.. ఇక్కడ విద్యాలయం ప్రవేశపెట్టిన విధానం మహర్షి పరాశరాని గుర్తు చేస్తోందని అన్నారు.

Also Read : NEET UG 2024 : నీట్ యూజీ 2024 మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్.. త్వరలో అడ్మిట్ కార్డ్‌లు విడుదల!

నేడు తల్లిదండ్రులు పిల్లలకు విద్య అనేది కేవలం సంపాదన కోసం మాత్రమే అనుకుంటున్నారని, జీవితం అనేది ఓ పూలబాట కాదని అన్నారు. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు చేపట్టే ముందు దేశం అస్తవ్యస్తంగా ఉంది. మోదీ వచ్చాక అందరూ హిందువులము, భారతదేశం నుంచి వచ్చామని గర్వంగా చెప్పుకుంటున్నారు. కారణం.. దేశంలో మంచి నాయకుడు ఉన్నాడు. అందుకే మోదీ కూడా సంఘ్ పరివార్ ప్రొడక్ట్ అని చిన్నజీయర్ స్వామీజీ పేర్కొన్నారు. సమస్యలను ఛాలెంజ్ గా తీసుకుంటే ఎవరైనా కూడా అదిగమించవచ్చు. సరస్వతీ శిశు మందిర్ చిన్నగా ప్రారంభమయ్యాయి. నేడు దేశవ్యాప్తంగా మోదీ లాంటి వ్యక్తులను దేశానికి పరిచయం చేసింది శిశు మందిర్ స్కూల్ అని అన్నారు. నాస్తికులను కూడా గౌరవిస్తాం. ఎవరి మతాలు వారు అనుసరించాలి. దానితోపాటు ఇతరులను కూడా గౌరవించాలని చిన్న జీయర్ స్వామీజీ సూచించారు.

Also Read : Harish Rao Thanneeru : కేసీఆర్ లాంటి నాయకుడు ఉండగా హిందువులు, ముస్లింల ఆస్తులకు ఇబ్బందులు ఉండవు- హరీశ్ రావు

 

ట్రెండింగ్ వార్తలు