భారత్-పాక్ మ్యాచ్.. స్టేడియంలో ఈ సీటు ధర రూ.1.46 కోట్లు!

స్టేడియంలోని సెక్షన్ 252లోని 20వ రోలో సీట్ నంబర్ 30ని రీసేల్ మార్కెట్లో ఇంత భారీ ధరకు..

Nassau County International Cricket Stadium

టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా సోమవారం జరగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. న్యూయార్క్‌లోని ఈస్ట్ మేడో, నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.

ఈ మ్యాచ్ కోసం టికెట్ల విక్రయాలు జరుగుతున్నాయి. స్టేడియంలోని ఓ సీటు ధరను రీసేల్ మార్కెట్లో స్టబ్‌హబ్ (Stubhub) లిస్ట్ చేసిన తీరు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఆ సీటులో కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూడాలని ధరల పట్టిక చూస్తున్న వారికి టికెట్ రేటు రూ.1.46 కోట్లు (175,400 డాలర్లు)గా కనపడుతోంది.

స్టేడియంలోని సెక్షన్ 252లోని 20వ రోలో సీట్ నంబర్ 30ని రీసేల్ మార్కెట్లో ఇంత భారీ ధరకు విక్రయించాలనుకుంటున్నారు. దాని ధర రూ.1.46 కోట్లుగా లిస్ట్ చేశారు. అమెరికాలో ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్స్ట్ ఈవెంట్‌ల టిక్కెట్‌లను చట్టబద్ధంగానే మార్కప్‌లతో అమ్ముకోవచ్చు.

ఆ సీట్ టికెట్ ను కచ్చితంగా ఆ ధరకు విక్రయిస్తారని కాదు. దాన్ని అమ్మేవారు అంత ధరకు అంత ధరను లిస్ట్ చేసి ఉంచారు. స్టబ్ హబ్ లో లిస్ట్ చేసిన రెండవ అత్యంత ఖరీదైన సీటు.. సెక్షన్ 101లో ఉంది. అందులో ఓ సీటు ధర రూ.15,03,346గా ఉంది. ఇక స్టేడియంలోని సెక్షన్ 252లో దాని పక్కనే ఉన్న వరుసలలోని టికెట్‌లు మాత్రం తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. 21వ రోలోని టికెట్ ధర రూ.57,878గా ఉంది. మిగతా రోల్లోని సీట్లలో కూడా ధర రూ.లక్షలోపు ఉంది.

Also Read: రూ.1.5 లక్షల ఐఫోన్‌ను బండరాళ్ల మధ్య పడేసుకున్న యువతి.. ఎలా బయటకు తీశారో చూడండి..

ట్రెండింగ్ వార్తలు