IND-W vs BAN-W : రేణుకా సింగ్ మాయ‌.. మూడు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌..updates

దుంబుల్లా వేదిక‌గా భార‌త్‌, బంగ్లాదేశ్ మ‌హిళ‌ల జ‌ట్లు సెమీ ఫైన‌ల్ మ్యాచులో త‌ల‌ప‌డుతున్నాయి.

IND-W vs BAN-W

ముర్షిదా ఖాతున్ ఔట్‌..
రేణుకా సింగ్ బౌలింగ్‌లో ష‌ఫాలీ వ‌ర్మ‌ క్యాచ్ అందుకోవ‌డంతో ముర్షిదా ఖాతున్ (4) ఔటైంది. దీంతో 4.5వ ఓవ‌ర్‌లో 21 ప‌రుగుల వ‌ద్ద బంగ్లాదేశ్ మూడు వికెట్లు కోల్పోయింది.

ఇష్మా తంజిమ్ ఔట్‌..
బంగ్లాదేశ్ మ‌రో వికెట్ కోల్పోయింది. రేణుకా సింగ్ బౌలింగ్‌లో తనూజా కన్వర్ క్యాచ్ అందుకోవ‌డంతో ఇష్మా తంజిమ్ (8) పెవిలియ‌న్‌కు చేరుకుంది. దీంతో 2.6వ ఓవ‌ర్‌లో 17 ప‌రుగుల వ‌ద్ద బంగ్లాదేశ్ రెండో వికెట్ కోల్పోయింది.

ఆదిలోనే షాక్‌..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌కు తొలి ఓవ‌ర్‌లోనే షాక్ త‌గిలింది. రేణాసింగ్ బౌలింగ్‌లో ఉమా చెత్రీ క్యాచ్ అందుకోవ‌డంతో దిలారా అక్ట‌ర్ (6) ఔట్ అయ్యింది. దీంతో బంగ్లాదేశ్ 0.4 ఓవ‌ర్ల‌లో 7 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది.

బంగ్లాదేశ్ జ‌ట్టు..
దిలారా అక్టర్, ముర్షిదా ఖాతున్, నిగర్ సుల్తానా (కెప్టెన్‌), రుమానా అహ్మద్, ఇష్మా తంజిమ్, రీతు మోని, రబెయా ఖాన్, షోర్నా అక్టర్, నహిదా అక్టర్, జహనారా ఆలం, మరుఫా అక్టర్

భార‌త జ‌ట్టు..
షఫాలీ వర్మ, స్మృతి మంధాన, ఉమా చెత్రీ, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీప‌ర్‌), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, తనూజా కన్వర్, రేణుకా ఠాకూర్ సింగ్ ఆడుతున్నారు.

టాస్‌..
శ్రీలంక వేదిక‌గా జరుగుతున్న మ‌హిళ‌ల ఆసియా క‌ప్ 2024 ఆఖ‌రి అంకానికి చేరుకుంది. దుంబుల్లా వేదిక‌గా భార‌త్‌, బంగ్లాదేశ్ మ‌హిళ‌ల జ‌ట్లు సెమీ ఫైన‌ల్ మ్యాచులో త‌ల‌ప‌డుతున్నాయి. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది.

ట్రెండింగ్ వార్తలు