Gautam Gambhir : శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్.. తిలక్ వర్మ కోసం గంభీర్ పట్టు.. పరాగ్‌ను ఎంపిక చేసిన బీసీసీఐ.. ఎందుకంటే..?
టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ తొలి సిరీస్‌కు సిద్ధం అయ్యాడు.
- Thota Vamshi Kumar
- Published On : July 25, 2024 / 07:36 PM IST
Gautam Gambhir Wanted Tilak Varma For Sri Lanka Tour Report
Gautam Gambhir – Tilak Varma : టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ తొలి సిరీస్‌కు సిద్ధం అయ్యాడు. జూలై 27 నుంచి శ్రీలంకతో భారత్ టీ20 సిరీస్ ఆడనుంది. అనంతరం ఆగస్టు 2 నుంచి వన్డే సిరీస్‌లో తలపడనుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఈ సిరీస్‌లకు సంబంధించిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే.. టీ20, వన్డే సిరీస్‌లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ను ఎంపిక చేయాలని గౌతమ్ గంభీర్ సెలక్టర్లకు సూచించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
అయితే.. గాయం కారణంగా అతడిని ఎంపిక చేయలేదట. అతడి స్థానంలోనే రియాన్ పరాగ్ ఎంపిక చేసినట్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో పేర్కొంది. చేతికి గాయం కావడంతో ఐపీఎల్ 2024 నుంచి తిలక్ ఆటకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే అతడిని లంక టూర్‌కు ఎంపిక చేయలేదు. అతడి స్థానంలో జింబాబ్వే పర్యటనలో విఫలం అయినప్పటికీ కూడా నమ్మకం ఉంచి సెలక్టర్లు రియాన్ పరాగ్ ను ఎంపిక చేసినట్లుగా తెలిపింది.
Rohit Sharma : స్వదేశానికి చేరుకున్న రోహిత్ శర్మ.. వీడియో వైరల్
‘పరాగ్ కు ఎంతో టాలెంట్ ఉంది. ఆల్‌రౌండర్‌గా ఉపయోగపడతాడు. ఆఫ్ ది ఫీల్డ్, ఆన్ ది ఫీల్డ్ లో తన వైఖరిని మార్చుకున్నాడు. క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అతడు అద్భుతమైన ఫీల్డర్ కూడా. బౌలింగ్‌లోనూ రాణించగలడు. అందుకనే అతడిని సెలక్టర్లు ప్రోత్సహించాలనుకుంటున్నారని. ‘బీసీసీఐ వర్గాలు తెలిపినట్లుగా పేర్కొంది.
శ్రీలంకతో టీ20 సిరీస్‌కు భారత జట్టు..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్.
IND vs SL : భారత్‌తో టీ20 సిరీస్‌కు ముందు శ్రీలంకకు వరుస షాక్‌లు.. మరో పేసర్ దూరం..
